Harish rao: ఇవి అచ్చెదిన్‌ కాదు, సామాన్యుడు సచ్చెదిన్‌.. కేంద్రంపై హరీష్‌ రావు ఫైర్‌.

కేంద్ర ప్రభుత్వం వర్సెస్‌ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం రోజురోజుకీ పెరిగిపోతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు....

Harish rao: ఇవి అచ్చెదిన్‌ కాదు, సామాన్యుడు సచ్చెదిన్‌.. కేంద్రంపై హరీష్‌ రావు ఫైర్‌.
Harish Rao
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 30, 2023 | 7:00 PM

కేంద్ర ప్రభుత్వం వర్సెస్‌ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం రోజురోజుకీ పెరిగిపోతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు కేంద్ర ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. ఏప్రిల్‌ నుంచి ఔషధాల ధరలు 12 శాతం పెంచనుండడంపై ట్వి్ట్టర్‌ వేదికగా స్పందించారు మంత్రి హరీష్‌ రావు. దేశంలో బిజెపి పాలనకు రోజులు దగ్గర పడ్డాయంటూ విరుచుకుపడ్డారు.

ఈ విషయమై హరీష్ రావు ట్వీట్ చేస్తూ.. ‘ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలకి భారం అవుతుంది. సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బిజెపి ప్రభుత్వం పనిగా పెట్టుకుంద’ని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

ఇక.. ‘అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైంది. ఇది అత్యంత బాధాకరం. దుర్మార్గమైన చర్య. ఇదేనా బిజెపి చెబుతున్న అమృత్ కాల్..?? ఇవి అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్’ అంటూ చురకలు అంటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..