Toll charges: వాహనదారులకు ఇక చుక్కలే.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు.
వాహనదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి చుక్కలు కనిపించనున్నాయి. దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీలు భారీగా పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ టోల్ చార్జీలు..
వాహనదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి చుక్కలు కనిపించనున్నాయి. దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీలు భారీగా పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ టోల్ చార్జీలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రతీ ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈసారి కూడా టోల్ ఛార్జీలు పెంచనున్నారు.
ఈ ఏడాది టోల్ ఛార్జీలు ఏకంగా 5 నుంచి 10 శాతం పెరగనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనలపై టోల్ ధరలు రూ. 10 నుంచి రూ. 60 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెరిగిన టోల్ ఛార్జీల వల్ల కార్లు, జీపులకు రూ.5 నుంచి రూ.10కి, బస్సులు, లారీలకు రూ.15 నుంచి రూ.25కి, భారీ వాహనాలకు రూ.40 నుంచి రూ.50కి పెరగనుంది. ఇక సింగిల్, డబుల్ ట్రిప్‌లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. రాష్ట్రంలో అన్ని నేషనల్ హైవేస్‌పై కలిపి 57 టోల్ ప్లాజాలున్నాయి. వీటి మీదుగా వెళ్లే వాహనాల ద్వారా ప్రస్తుతం రోజుకు సగటున రూ.6.6 కోట్ల వరకు టోల్ వసూలవుతోంది. అంటే సంవత్సరానికి దాదాపు రూ.2,409 కోట్ల వరకు వస్తోంది. పెంచిన టోల్ ఛార్జీలతో ఈ మొత్తం ఇంకా పెరగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..