Telangana Elections: నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేత..!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గులాబీ అధినేత కేసీఆర్ విడుదల చేసిన తొలి జాబితాలో చోటు దక్కింది. నకిరేకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. కానీ సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు అవకాశం ఇచ్చారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశంపై కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన చిరుమర్తి లింగయ్య ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచి నకిరేకల్ నియోజకవర్గంలో గ్రూప్ వార్ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య...

Telangana Elections: నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేత..!
Ex MLA Vemula Veeresham
Follow us

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 23, 2023 | 9:00 PM

నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలందరితో చర్చించి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. వారం, పది రోజుల్లో రాజకీయ నిర్ణయం తీసుకుంటానని వీరేశం అంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గులాబీ అధినేత కేసీఆర్ విడుదల చేసిన తొలి జాబితాలో చోటు దక్కింది. నకిరేకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. కానీ సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు అవకాశం ఇచ్చారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశంపై కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన చిరుమర్తి లింగయ్య ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచి నకిరేకల్ నియోజకవర్గంలో గ్రూప్ వార్ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో వర్గ పోరు కొనసాగింది. ఈ సారి తనకే టికెట్ ఇవ్వాలంటూ వేముల వీరేశం పార్టీ అధినేతల్ని కలిసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఏది ఏమైనా ఎన్నికల బరిలో ఉంటానని వీరేశం చెబుతున్నారు.

నకిరేకల్‌లో ముఖ్య కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమావేశం తర్వాత వేముల వీరేశం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగున్నరేళ్లు బీఆర్ఎస్ పార్టీలో భాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని వదిలేస్తున్నాని, కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని ఆయన చెప్పారు.

వారం, పది రోజుల్లో రాజకీయ నిర్ణయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అన్నారు. రాజకీయ పార్టీతోనే నకిరేకల్ బరిలో పోటీలో ఉంటానని వీరేశం స్పష్టం చేశారు. తన గెలుపే అన్నింటికీ సమాధానం చెబుతోందని ఆయన అన్నారు. ‘బరాబర్ నేను మాజీ నక్సలైట్ నే.. పేద ప్రజల కోసమే పోరాడే వ్యక్తిని నేను’ అని చెప్పారు.

ఇదిలాఉంటే.. వారం, పది రోజుల్లో వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులు వేముల వీరేశంతో చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే వేముల వీరేశం రాకను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమ్మతితో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వేముల వీరేశం ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సంపాదించేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారట. కాంగ్రెస్ అభ్యర్థిగా నకిరేకల్ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించాలని పట్టుదలతో వేముల వీరేశం ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..