Minister Harish Rao: బీఆర్ఎస్ అంటే అభివృద్ధి.. బీజేపీ అంటే అదోగతి.. కొత్త అర్థం చెప్పిన మంత్రి హరీష్ రావు..

అదానీ ఆదాయం కోసం బీజేపీ పని చేస్తుంటే.. రైతుల ఆదాయం పెంచేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు దేశానికి ఏం చేశాయని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండల కేద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీష్ రావు అన్నారు.

Minister Harish Rao: బీఆర్ఎస్ అంటే అభివృద్ధి.. బీజేపీ అంటే అదోగతి..  కొత్త అర్థం చెప్పిన మంత్రి హరీష్ రావు..
Harish Rao
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 29, 2023 | 3:09 PM

ప్రజలకు కష్టాల్లో ఉన్న ప్రతి సారి బీఆర్‌ఎస్ పార్టీ ఆదుకుందని.. భవిష్యత్తులో ఆదుకునేది కూడా బీఆర్‌ఎస్ పార్టీ అని అన్నారు మంత్రి హరీష్ రావు. నంగునూరు, సిద్దిపేట ఆత్మీయ సమ్మేళనంలోఈ వ్యాఖ్యలు చేశారు. కలలోనైనా అనుకున్నారా 24 గంటలు కరెంట్ వస్తుందని ప్రశ్నించారు. కలలోనైనా అనుకున్నారా ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దూకుతాయని.. కలలోనైనా అనుకున్నామా కళ్యాణ లక్ష్మితో లక్షరూపాయలు వస్తాయని అనుకున్నామా.. కలలోనైనా అనుకున్నామా రైతుబంధు, రైతుభీమా పథకాలు వస్తాయని అనుకున్నామా.. కలలోనైనా అనుకున్నామా కాళేశ్వరం కట్టుకొని కోటి ఎకరాల మాగాణిగా మార్చుకుంటామని.. కలలోనైనా అనుకోని పనులు చేసిన గొప్ప మనిషి మన సీఎం కేసీఆర్ సార్ అని అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో ఇన్నీ అసాధ్యాలు సుసాధ్యం అయ్యాయంటే మన అల్లాద్ధీన్ దీపం లేదు…! తెలంగాణకు సీఎం కేసీఆర్ అనే మహా దీపం అండగా ఉంది కాబట్టి అందరం చల్లగా ఉన్నామన్నారు.

గత ప్రభుత్వాలు పేద ప్రజల కళ్లల్లో నీళ్లు రప్పిస్తే.. నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం శుద్ధమైన నీళ్లు తాగిస్తుందన్నారు. బీఆర్ఎస్ అంటే అభివృద్ధి.. బీజేపీ అంటే అదోగతి అంటూ హరీష్ రావు వ్యాఖ్యనించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంపద పెంచింది.. ప్రజలకు పెంచిందన్నారు. బీజేపీ ఆదానీ ఆమ్ దానీ పెంచుతుంటే సీఎం కేసీఆర్ తెలంగాణ రైతుల ఆమ్ దానీ పెంచుతుందన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ అంటే B- బీదల పార్టీ, R-రైతుల పార్టీ, S-సామాన్య మధ్య తరగతి పార్టీ అంటే కొత్త అర్థం చెప్పారు మంత్రి హరీష్ రావు.

కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచితే బీజేపీ వాళ్లు పేదల వద్ద పన్నులు గుంజి అదానికి పెడుతున్నారని విమర్శించారు. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ యాశంగి కొనదు అందుకే రాష్ట్రంలో కొంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగీ లో 56లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతుందన్నారు. సగం దేశానికి అన్నం పెట్టే దాన్యగారంగా తెలంగాణ మారిందన్నారు.

కార్యకర్తలు చిన్నచిన్న పొరపొచ్చాలు ఉంటే మాట్లాడుకుందామన్నారు. కన్నతల్లి లాంటిది పార్టీ, కాపాడుకునే బాధ్యత మనందరిదన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశ వ్యాప్తంగా బలపరచడానికి కార్యకర్తలు సిద్దంగా ఉండాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన నీటిని తాగేందుకు అవకాశం లభించిందన్నారు మంత్రి హరీష్ రావు. గతంలో పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలు కలుషిత నీరు తాగి ఆరోగ్య సమస్యలతో చనిపోయే పరిస్థుతులు ఉండేవన్నారు. 400 ఎకరాల్లో ఐటీ పార్కు పటాన్ చెరులో రాబోతున్నందన్నారు. రూ. 250 కోట్లతో త్వరలో పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు.

సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ కూడా త్వరలో రాబోతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగులకు 3 వేల రూపాయల పించన్ ఇస్తూ అందుకుంటుందన్నారు. తెలంగాణలో నాడు ఉన్న కరెంటు కష్టాలు నేడు లేవన్నారు మంత్రి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం