అమ్మాయిల్ని పంపించమన్నాడు.. నమ్మించి మోసం చేశాడు.. బ్లాక్‌మెయిల్ చేసి బెదిరింపులకి దిగాడు.. బెల్లంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరిజెన్ డైరీ డైరెక్టర్ శేజల్ చేసిన సంచలన ఆరోపణలివి. కేవలం ఆరోపణలే కాదూ.. అందుకు ఆధారాలు ఉన్నాయంటూ ఆడియో, వీడియోలను రిలీజ్ చేశారు. శేజల్.. ఆరిజెన్ డైరీలో వన్ ఆఫ్ ది పార్ట్‌నర్. అదే కంపెనీలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు బాగా తెలిసిన వ్యక్తి కూడా భాగస్వామిగా ఉన్నాడంటోంది శేజల్. ఆ సంస్థ ఓపెనింగ్‌కి ఎమ్మెల్యే వచ్చాడని.. అక్కడే తమకు పరిచయం అయ్యాడంటోంది. మొదట్లో బాగానే ఉన్నా.. ఆ తర్వాత తనలో అసలు స్వరూపం బయటపడిందన్నారు. తన ఫ్రెండ్‌ను ఇంటికి పంపించాలని బలవంతం చేశాడని ఆరోపంచారు శేజల్.
దళిత బంధు గురించి మాట్లాడుదామని పిలిచిన ఎమ్మెల్యే.. తమకు అల్కహాల్ ఆఫర్ చేశాడన్నారు శేజల్. అందుకు తిరస్కరించడంతో కక్షసాధింపు చర్యలకు దిగాడని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులెవరూ తమకు న్యాయం చేయలేదని.. తనకు ఏం జరిగినా ఎమ్మెల్యే, పోలీసులదే బాధ్యత అన్నారు శేజల్.
శేజల్ ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. కొంతమంది వ్యక్తులు రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నారని అన్నారు. వాటిని న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. ఎమ్మెల్యే వాదనలో ఎలాంటి నిజం లేదన్నారు శేజల్. కావాలంటే సీసీ ఫుటేజ్ తిరగేయాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..