Telangana Junior Linemen Jobs: తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) విడుదల చేసిన 1601 జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? పదో తరగతి అర్హత కలిగిన ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తోంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసకోని అభ్యర్ధులు వెంటనే ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సిందిగా టీఎస్‌ఎస్పీడీసీఎల్ సూచిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్ స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు ఖచ్చితంగా 18 నుంచి 44 యేళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.320లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే సవరణ చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 30వ తేదీన రాత పరీక్ష జరుగుతుంది. హాల్ టికెట్లు ఏప్రిల్ 24 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.24,340ల నుంచి రూ.39,405ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.