Telangana: తెలంగాణ రైతాంగానికి మరో గుడ్‌న్యూస్.. లక్ష లోపు రైతు రుణాలన్నీ మాఫీ
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేసింది. ఇప్పటి వరకు 16.16లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఈ నెల 2న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్.. ఆగస్టు 3 నుంచి రైతుమాఫీని ప్రారంభించాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు, సంబంధిత అధికారులను ఆదేశించారు.
రైతులకు రుణమాఫీపై ముఖ్యమంత్రి హామీని 100 శాతం నెరవేర్చేలా క్రియశీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటికే రైతు రుణమాఫీపై ప్రకటన చేసిన సీఎం కేసీఆర్.. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగానే..రాష్ట్ర రైతాంగానికి శుభవార్తనందించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.లక్షలోపు రుణమాఫీ చేసింది సీఎం కేసీఆర్ ప్రభుత్వం. పంద్రాగస్టుకు ఒకరోజు ముందుగానే.. ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేసింది. ఇప్పటి వరకు 16.16లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఈ నెల 2న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్.. ఆగస్టు 3 నుంచి రైతుమాఫీని ప్రారంభించాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు, సంబంధిత అధికారులను ఆదేశించారు.
అయితే, సీఎం కేసీఆర్ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేసినందుకు తెలంగాణలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ ఉత్తర్వులతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జెండా పండగకు ముందు రోజు శుభవార్త చెప్పడంతో సీఎం కేసీఆర్ కు రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అజెండాలో రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధికి అగ్రస్థానం కొనసాగుతుందని పునరుద్ఘాటించిన ఈ నెల 2 నుంచే రుణమాఫీ ప్రక్రియను పునఃప్రారంభించి నెలన్నరలోగా పూర్తి చేయాలన్నారు.
రైతులకు రుణమాఫీపై ముఖ్యమంత్రి హామీని 100 శాతం నెరవేర్చేలా సెప్టెంబర్ 15 నాటికి మాఫీ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలన్నారు. పంట రుణాల మాఫీ పథకం ద్వారా రైతులకు ఐదు విడతల్లో రూ.లక్ష వరకు ఉపశమనం కల్పించాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి