Realme C55: రియల్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. తక్కువ ధరలో ఊహకందని ఫీచర్లు.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ రియల్ మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మొన్నటి వరకు ప్రీమియం ఫోన్‌లను తీసుకొస్తున్న రియల్‌మీ తాజాగా బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ సీ55 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ తొలి సేల్ మార్చి 28వ తేదీ..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ రియల్ మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మొన్నటి వరకు ప్రీమియం ఫోన్‌లను తీసుకొస్తున్న రియల్‌మీ తాజాగా బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ సీ55 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ తొలి సేల్ మార్చి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర విషయానికొస్తే ప్రారంభ ధర రూ. 10,999గా ఉంది.
4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 10,999కాగా, 6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ ధర రూ. 11,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 13,999గా ఉంది. రియల్‌మీ సీ55 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ స్క్రీన్‌ను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 180హెచ్‌జెడ్ ఈ ఫోన్ స్క్రీన్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ88 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 33W SuperVOOC వైర్డ్ చార్జర్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీని అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..