Infinix Hot 30i: భారత మార్కెట్లోకి ఇన్ఫీనిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌.. రూ. 9వేలలో 50 ఎంపీ కెమెరా.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఇన్ఫీనిక్స్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ఐ పేరుతో సోమవారం భారత మార్కెట్లోకి ఈ స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్ల కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా...

Infinix Hot 30i: భారత మార్కెట్లోకి ఇన్ఫీనిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌.. రూ. 9వేలలో 50 ఎంపీ కెమెరా.
Infinix Hot 30i
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 27, 2023 | 8:30 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఇన్ఫీనిక్స్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ఐ పేరుతో సోమవారం భారత మార్కెట్లోకి ఈ స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్ల కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 8జీబీ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 8,999కి అందుబాటులో ఉంది. ర్యామ్‌ను వర్చువల్‌గా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.

డైమండ్‌ వైట్‌, గ్లేషియర్‌ బ్లూ, మిర్రర్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ సేల్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే స్టాండ్‌బై మోడ్‌లో 30 రోజుల వరకు పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ జీ37 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ ఫోన్‌లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ఇక ఎస్‌డీ కార్డు ద్వారా మెమొరీని 1టీవీ వరకు పెంచుకోవచ్చు. 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, బ్లూటూత్‌, ఓటీజీ, వైఫై ఫీచర్లను అందించారు. ఫేస్‌ అన్‌లాకింగ్‌, సైడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..