FIFA WC 2022: పాపం రొనాల్డో.. ఈ ఏడాది కూడా ఒట్టి చేతులతోనే.. కీలక మ్యాచ్‌లో దిమ్మతిరిగే షాకిచ్చిన మొరాకో..

FIFA WC 2022: క్వార్టర్ ఫైనల్స్‌లో పోర్చుగల్‌ను ఓడించి మొరాకో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. FIFA వరల్డ్ కప్ 2022లో మొరాకో సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది.

FIFA WC 2022: పాపం రొనాల్డో.. ఈ ఏడాది కూడా ఒట్టి చేతులతోనే.. కీలక మ్యాచ్‌లో దిమ్మతిరిగే షాకిచ్చిన మొరాకో..
Mar Vs Por, Fifa Wc 2022
Follow us
Venkata Chari

|

Updated on: Dec 11, 2022 | 6:40 AM

Morocco vs Portugal FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచ కప్ 2022 క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో, మొరాకో శనివారం అర్జెంటీనాను 1-0తో ఓడించి, భారీ షాక్ ఇచ్చింది. ఈ విజయంతో మొరాకో సెమీఫైనల్‌కు చేరుకుంది. మొరాకోకు ఈ విజయం చారిత్రాత్మకంగా మారింది. సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికా దేశంగా నిలిచింది. జట్టు తరపున క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో యూసుఫ్ ఎన్ నెస్రీ ఏకైక గోల్ చేశాడు.

చివరి నిమిషాల్లో 10 మందితో ఆడినప్పటికీ యూసఫ్ ఎన్ నెస్రీ హెడర్‌తో మొరాకో సెమీ-ఫైనల్‌లో చోటు సంపాదించింది. సెకండాఫ్‌లో చివరి ఆరు నిమిషాల ఇంజూరీ టైమ్‌లో మొరాకో జట్టు 10 మంది ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చింది. అయితే ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ పోర్చుగల్ జట్టు దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అల్ తుమామా స్టేడియంలో ప్రపంచ 22వ ర్యాంకర్ మొరాకో తరపున యూసఫ్ ఎన్ నెస్రీ 42వ నిమిషంలో విజయ గోల్ సాధించాడు. ప్రపంచకప్ నాకౌట్‌లో మొరాకోకు ఇదే తొలి గోల్ కావడం విశేషం. మొరాకో యూరోప్ లేదా దక్షిణ అమెరికా వెలుపలి నుంచి ఖతార్‌లో చివరి ఎనిమిదికి చేరుకున్న ఏకైక జట్టుగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్‌కు చేరిన మొదటి ఆఫ్రికన్ దేశంగా మొరాకో ఓ రికార్డ్ నెలకొల్పింది. అంతకుముందు, 1990లో కామెరూన్, 2002లో సెనెగల్, 2010లో ఘనా చివరి ఎనిమిది స్థానాల్లోకి ప్రవేశించాయి. అయితే ఈ మూడు జట్లలో ఏ ఒక్కటీ సెమీ-ఫైనల్‌కు చేరుకోలేదు. ఇప్పటి వరకు తమ క్యాంపైన్‌లో జట్టు కేవలం ఒక గోల్ మాత్రమే చేసింది. అది కూడా కెనడాపై సెల్ఫ్ గోల్ ద్వారా మాత్రమే కావడం గమనార్హం.

పోర్చుగల్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో గోల్‌కీపర్‌ యాసిన్‌ బోన్నో నేతృత్వంలోని జట్టు డిఫెన్స్‌ నిలదొక్కుకుంది. సెమీ-ఫైనల్‌లో, మొరాకో ఇప్పుడు డిసెంబరు 15న మాజీ ఛాంపియన్స్ ఇంగ్లండ్ వర్సెస్ డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ మధ్య జరిగే క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ విజేతతో తలపడుతుంది. పోర్చుగల్‌పై ఈ ఓటమి తర్వాత, ఐదు ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన ఏకైక ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో ప్రపంచకప్ ట్రోఫీని ఎప్పటికీ ఎత్తలేడని దాదాపు ఖాయంగా మారింది. ఈ 37 ఏళ్ల ఆటగాడు బహుశా తన చివరి ప్రపంచకప్‌ను ఆడుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..