Watch Video: నా జీవితం ఆమె వల్లే మారింది.. లేదంటే..: విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Viral Video: గత కొన్నేళ్లుగా క్రికెట్‌లో విరాట్ కోహ్లీ స్థాయి బాగా పెరిగింది. గడ్డుకాలం నుంచి బయటకి వచ్చిన తరువాత, అద్భుతమైన ఫాంతో దూసుకపోతున్నాడు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోడ్‌కాస్ట్‌లో కోహ్లీ తన ప్రయాణం గురించి మాట్లాడాడు.
గత కొన్నేళ్లుగా క్రికెట్‌లో విరాట్ కోహ్లీ స్థాయి బాగా పెరిగింది. గడ్డుకాలం నుంచి బయటకి వచ్చిన తరువాత, అద్భుతమైన ఫాంతో దూసుకపోతున్నాడు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోడ్‌కాస్ట్‌లో కోహ్లీ తన ప్రయాణం గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో ఎన్నో విషయాలు పంచుకున్నాడు. ఈ మేరకు తాజాగా ఆర్‌సీబీ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో మాట్లాడుతూ.. నా ఫిట్‌నెస్‌పై పనిచేశాను. కెరీర్‌లో చాలా దశలను చూశాను. కానీ అది అతని జీవితాన్ని మార్చలేదు. అనుష్క శర్మను కలవడంతో నా లైఫ్ జీవితాన్ని మారిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. జీవితంలోని ముఖ్యమైన క్షణాల గురించి మాట్లాడుతూ.. తన తండ్రి మరణానంతరం ఎన్నో విషయాలపై తన దృక్పథం మారిపోయిందని, అయితే తన జీవితంలో మాత్రం మార్పు రాలేదని భారత మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు.
‘మా నాన్న చనిపోయాక చూసే దృక్పథం మారిపోయింది. నా జీవితంలో మాత్రం మార్పు లేదు. మునుపటిలాగే ఉంది. జీవితంలో ఏం చేయాలనుకుంటున్నానో దానిపై దృష్టి మరింత బలపడింది. కలను నెరవేర్చుకోవడానికి ప్రేరణగా మిగిలింది. కానీ, అది నా జీవితాన్ని మార్చలేదు. నా చుట్టూ ఉన్న వాతావరణం ఏమాత్రం మారలేదు’ అంటూ తెలిపాడు.
ఆమె పరిచయంతో కీలక మార్పు..
Virat talks about how his life changed after meeting Anushka Sharma on @eatsurenow presents #RCBPodcast! ?#PlayBold @imVkohli @danishsait pic.twitter.com/90JHI5ESkr
— Royal Challengers Bangalore (@RCBTweets) March 9, 2023
జీవితాన్ని మార్చిన క్షణాల గురించి కోహ్లీ మాట్లాడుతూ, అనుష్కను కలిసిన తర్వాత, జీవితాన్ని పూర్తి భిన్నంగా చూడటం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. నేను జీవితంలో భిన్నమైన కోణాన్ని చూశాను. కాబట్టి నేను అనుష్కను కలవడం జీవితాన్ని మార్చే క్షణం అని పిలుస్తానని ఈ మాజీ సారథి చెప్పుకొచ్చాడు.
ప్రేమ అంతా మార్చేసింది..
‘ఇది నా జీవితాన్ని మార్చే క్షణమని, ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు, మీలో మార్పులు మొదలవుతాయి. ప్రేమించిన వారితో కలిసి ముందుకు సాగాలని కోరుకుంటాం. మీరు చాలా విషయాలను అంగీకరించాలి. అందుకే ఈ క్షణం నాకు జీవితాన్ని మార్చే క్షణం’ అంటూ కోహ్లీ పేర్కొన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..