IPL 2023: ‘ఆర్సీబీ టీంలో ఆ ముగ్గురే కీలకం.. ప్లేయింగ్ ఎలెవన్‌లో టీ20 స్పెషలిస్టులు, హార్డ్ హిట్టర్లు’..

క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ 2023 మొదలు కానుంది..

IPL 2023: 'ఆర్సీబీ టీంలో ఆ ముగ్గురే కీలకం.. ప్లేయింగ్ ఎలెవన్‌లో టీ20 స్పెషలిస్టులు, హార్డ్ హిట్టర్లు'..
Rcb
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 23, 2023 | 10:12 AM

క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ 2023 మొదలు కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఏప్రిల్ 1న కేకేఆర్, పంజాబ్.. ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెర్సస్ ముంబై ఇండియన్స్ తలబడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో RCB జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దీనిపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఎప్పటిలానే ఈసారి కూడా బెంగళూరు జట్టు పటిష్టంగా బరిలోకి దిగుతోందన్నాడు. టీ20 స్పెషలిస్టులు, హార్డ్ హిట్టర్లు, అద్భుతమైన బౌలర్లతో ఆ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండబోతోందని స్పష్టం చేశాడు. ఈసారి ఆర్సీబీ జట్టు విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా బరిలోకి దింపుతుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అనూజ్ రావత్‌కు బదులుగా మహిపాల్ లోమ్రార్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించవచ్చునని.. గాయపడిన జోష్ హేజిల్‌వుడ్ ఆడకపోతే రీస్ టాప్లీకి అవకాశం లభిస్తుందని అశ్విన్ పేర్కొన్నాడు.

బెంగళూరు జట్టు(తొలి మ్యాచ్ అంచనా):

ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రార్, వానిందు హసరంగా, జోష్ హాజిల్‌వుడ్/టాప్లీ, ఆకాష్ దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

RCB ఫుల్ స్క్వాడ్:

ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, మైకేల్ బ్రేస్‌వెల్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ సింగ్, రాజన్ సింగ్, , గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, డేవిడ్ విల్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, మనోజ్ భాండాగే, సోనూ యాదవ్.