IPL 2023: ఐపీఎల్‌కు గ్లామర్‌ టచ్‌.. డ్యాన్స్‌తో అదరగొట్టనున్నరష్మిక, తమన్నా.. రిహార్సల్స్‌ వీడియోలివిగో

IPL 2023 Opening Ceremony: మ్యాచ్ కన్నా ముందు అట్టహాసంగా ధనాధాన్‌ లీగ్‌ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం పాన్‌ ఇండియా బ్యూటీలను రంగంలోకి దింపారు. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా ఓపెనింగ్‌ సెర్మనీలో లైవ్‌ పెర్ఫామెన్స్‌ ఇవ్వనున్నారు.

IPL 2023: ఐపీఎల్‌కు గ్లామర్‌ టచ్‌.. డ్యాన్స్‌తో అదరగొట్టనున్నరష్మిక, తమన్నా.. రిహార్సల్స్‌ వీడియోలివిగో
Rashmika, Tamannah, Arijit Singh
Follow us
Basha Shek

|

Updated on: Mar 31, 2023 | 11:05 AM

క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌ 2023 సమరం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇవాళ (మార్చి31) సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో డిపెండింగ్‌ ఛాంపియన్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే మ్యాచ్ కన్నా ముందు అట్టహాసంగా ధనాధాన్‌ లీగ్‌ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం పాన్‌ ఇండియా బ్యూటీలను రంగంలోకి దింపారు. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా ఓపెనింగ్‌ సెర్మనీలో లైవ్‌ పెర్ఫామెన్స్‌ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ఐపీఎల్‌ వేడుకల కోసం రష్మిక, తమన్నా ఇప్పటికే అహ్మదాబాద్‌ చేరుకున్నారు. డ్యాన్సింగ్‌ రిహార్సల్స్‌ కూడా మొదలెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు ఐపీఎల్‌ నిర్వాహకులు.

ఈ వేడుకల్లో బాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ అర్జీత్‌ సింగ్‌ కూడా లైవ్‌ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నాడు. ‘అర్జిత్‌ సింగ్‌, రష్మక మందన్నా లతో కలిసి వేదిక పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని తమన్నా చెప్పుకొచ్చింది. ఇక మొదటి మ్యాచ్‌లో ధోని ఆడడంపై సందేహాలున్నాయి. అయితే టీమ్‌ మేనేజ్‌మెంట్ మాత్రం ధోని బరిలోకి దిగుతాడని స్పష్టం చేసింది. ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఆతర్వాత 7.30 గంటలకు గుజరాత్, చెన్నైల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ అసలు సమరం షురూ కానుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by IPL (@iplt20)

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..