22 వేల పరుగులు, 500 కంటే ఎక్కువ వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రికార్డులు అసాధ్యమనిపించొచ్చు.. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనే ఈ అరుదైన రికార్డులు నెలకొల్పాడు ఇంగ్లిష్ ఆల్ రౌండర్ జాన్ ఇడెన్. 1902 జనవరి 8న ఇంగ్లాండ్‌లో జన్మించిన జాన్ 1924 నుండి 1945 వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపించాడు. తండ్రి నుంచి వారసత్వంగా క్రికెట్‌ను పుణికిపుచ్చుకున్న ఈ ఇంగ్లిష్ క్రికెటర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపించాడు. 1924లో, జాన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి వ్యతిరేకంగా లాంక్షైర్ తరపున అరంగేట్రం చేశాడు జాన్. మొత్తం 504 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 22, 681 పరుగులు చేశాడు. ఇందులో 46 సెంచరీలు, 112 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లోనూ అదుర్స్ అనిపించేలా 551 వికెట్లు తీశాడు. ఈ అద్భుత ప్రదర్శనతోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 1935లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు, కానీ అతను కేవలం 5 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. అందులో 2 అర్ధ సెంచరీలతో సహా మొత్తం 170 పరుగులు చేశాడు. జాన్ తన కెరీర్‌లో 14 సార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. అదే సమయంలో 2 సార్లు 10 వికెట్లు కూడా తీసుకున్నాడు.
జాన్ కెరీర్ అద్భుతంగా సాగుతోన్న సమయంలో రెండో ప్రపంచ యుద్ధం అతని కెరీర్‌ను బాగా ప్రభావితం చేసింది. 1939 సీజన్ ముగిసే సమయానికి అతని వయసు 37. కాగా క్రికెట్‌తో పాటు, జాన్ మాంచెస్టర్ కంపెనీలో సాంకేతిక నిపుణుడిగా కూడా పనిచేస్త్ఉండేవాడు. వాహనాల బ్రేక్ లైనింగ్‌లలో అతనికి బాగా నైపుణ్యం ఉంది. యుద్ధం తరువాత కూడా అతను ఈ సంస్థలో పని చేస్తూనే ఉన్నాడు. అయితే క్రికెట్ మీద ఆశలు వదులుకోలేని అతను1946 సీజన్‌లో అమెచ్యూర్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. కానీ అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదే ఏడాది ఏప్రిల్ 17న ఓ కారు ప్రమాదంలో కన్నుమూశాడీ ఆల్‌రౌండర్. ఇంటికి తిరిగివస్తుండగా అతను ప్రయాణిస్తున్నరోల్స్ రాయిస్ కారు ప్రమాదానికి గురైంది. దీంతో క్రికెట్ ప్రపంచం ఒక మేలైన ఆల్‌రౌండర్ సేవలను కోల్పోయినట్లైంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..