బ్యాడ్‌ బాయ్‌గా మారిపోతున్న బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌.. వైడ్‌ ఇవ్వలేదని మైదానంలో రచ్చ రచ్చ.. వీడియో వైరల్‌

|

Jan 08, 2023 | 9:05 AM

ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన బంగ్లా కెప్టెన్ కేవలం 32 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు, 7 బౌండరీలు ఉన్నాయి. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన ఫార్చూన్ బరిషల్ 194 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే సిల్హీద్ స్ట్రైకర్స్‌ ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది.

బ్యాడ్‌ బాయ్‌గా మారిపోతున్న బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌.. వైడ్‌ ఇవ్వలేదని మైదానంలో రచ్చ రచ్చ.. వీడియో వైరల్‌
Shakib Al Hasan
Follow us on

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్‌, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన ఆటతీరుతోనే కాకుండా తన ప్రవర్తనతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా ఇటీవల పదే పదే అంపైర్లతో గొడవపడుతూ బ్యాడ్‌ బ్యాయ్‌ ఇమేజ్‌ తెచ్చుకుంటున్నాడు. తాజాగా లైవ్‌ మ్యాచ్‌లోనే అంపైర్‌తో గొడవకు దిగాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. లీగ్‌లో భాగంగా ఫార్చూన్ బరిషల్ సిల్హీద్ స్ట్రైకర్స్‌ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన బంగ్లా కెప్టెన్ కేవలం 32 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు, 7 బౌండరీలు ఉన్నాయి. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన ఫార్చూన్ బరిషల్ 194 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే సిల్హీద్ స్ట్రైకర్స్‌ ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. కానీ, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే జట్టు విజయం లేదా ఓటమి గురించి కాదు, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మైదానంలో చేసిన రచ్చ గురించి. బరిషల్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో స్ట్రైకర్స్ బౌలర్ రేజర్ రెహమాన్ బంతిని అందుకున్నాడు. షకీబ్‌ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. అయితే ఆ ఓవర్‌ లో రెహమాన్‌ వేసిన బంతి కాస్తా షకీబ్‌కు దూరంగా వెళ్లింది. అయితే వైడ్‌ ఇచ్చేందుకు అంపైర్‌ నిరాకరించాడు.

గతంలోనూ..

అంతే ఆగ్రహంతో ఊగిపోయాడు బంగ్లా కెప్టెన్‌. ఏదో మాట్లాడుతూ, వైడ్‌ సిగ్నల్‌ చూపిస్తూ లెగ్‌ అంపైర్‌ దగ్గరకు దూసుకెళ్లాడు. అయితే అంపైర్‌ తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. దీంతో మరింత కోపోద్రిక్తుడయ్యాడు షకీబ్‌. క్రీజులో అసహనంతో కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

కాగా అంపైర్‌తో షకీబ్‌ ఇలా దురుసుగా ప్రవర్తించడం ఇదేమి మొదటిసారి కాదు. 2021 జూన్‌లో, ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నప్పుడు, అతను స్టంప్‌లతో అంపైర్ వైపు దూసుకెళ్లాడు. అదే సమయంలో, 2022 నవంబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మైదానంలోనే గొడవకు దిగాడు. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్ షకీబ్‌ ప్రవర్తనపై మండిపడుతున్నారు. ఆటతో పాటు అంపైర్లను గౌరవించడ నేర్చుకోవాలంటూ సూచిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..