Video: ఆడింది చాల్లేవయ్యా.. ఇక రిటైర్మెంట్ చేస్తే మంచిదన్నారు.. కట్‌చేస్తే.. డబుల్ సెంచరీతో 24 గంటల్లోనే స్ట్రాంగ్ కౌంటర్..

New Zealand vs Sri Lanka: తన రిటైర్మెంట్ గురించి అడిగిన వారికి 24 గంటల్లోనే కేన్ విలియమ్సన్ తగిన సమాధానం ఇచ్చాడు. శనివారం శ్రీలంకపై డబుల్ సెంచరీ సాధించి, తనలో ఇంకా సత్తా ఉందంటూ చాటిచెప్పాడు.

Video: ఆడింది చాల్లేవయ్యా.. ఇక రిటైర్మెంట్ చేస్తే మంచిదన్నారు.. కట్‌చేస్తే.. డబుల్ సెంచరీతో 24 గంటల్లోనే స్ట్రాంగ్ కౌంటర్..
Kane Williamson Nz Vs Sl
Follow us
Venkata Chari

|

Updated on: Mar 18, 2023 | 11:41 AM

Kane Williamson: తన రిటైర్మెంట్ గురించి అడిగిన వారికి 24 గంటల్లోనే కేన్ విలియమ్సన్ తగిన సమాధానం ఇచ్చాడు. శనివారం శ్రీలంకపై డబుల్ సెంచరీ సాధించి, తనలో ఇంకా సత్తా ఉందంటూ చాటిచెప్పాడు. కేన్ మామ 296 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లతో 215 పరుగులు చేసి, పెవిలియన్ చేరాడు. విలియమ్సన్ టెస్టు కెరీర్‌లో ఇది ఆరో డబుల్ సెంచరీ. అదే సమయంలో శ్రీలంకపై రెండోసారి డబుల్ సెంచరీ సాధించాడు. వెల్లింగ్‌టన్ గ్రౌండ్‌లో విలియమ్సన్ బ్యాట్ మెరుపులు మెరిపించింది. దీంతో తన రిటైర్మెంట్ వార్తలపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు.

రిటైర్మెంట్ ప్రశ్నపై విలియమ్సన్ మాట్లాడుతూ.. ఇంకా అంత పెద్దవాడిని కాలేదని, అంతర్జాతీయ ఆటలలో తనకు ఎదురయ్యే సవాళ్లను తాను ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.

ఇవి కూడా చదవండి

టెస్టు క్రికెట్‌లో రికార్డులు బ్రేక్ చేసిన కేన్ మామ..

ఈ డబుల్ సెంచరీతో పాటు విలియమ్సన్ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో 8124 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తరపున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కోహ్లి 7 డబుల్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. జో రూట్ 5, స్టీవ్ స్మిత్ 4 డబుల్ సెంచరీలతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

నికోల్స్‌తో భారీ భాగస్వామ్యం..

కేన్ విలియమ్సన్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అంతకుముందు గత రెండు మ్యాచ్‌ల్లో, అతను వరుసగా 2 సెంచరీలు సాధించాడు. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హెన్రీ నికోల్స్‌తో కలిసి 363 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నికోలస్ కూడా డబుల్ సెంచరీ చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఇదే అతని అత్యధిక స్కోరు కూడా. నికోల్స్ డబుల్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే, న్యూజిలాండ్ 4 వికెట్లకు 580 పరుగులు చేసి తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..