IPL 2023, RR vs PBKS: పోరాడి ఓడిన శామ్సన్‌ సేన.. సూపర్‌స్పెల్‌తో పంజాబ్‌ను గెలిపించిన నాథన్ ఎల్లిస్

తొలిసారిగా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోన్న గౌహతిలో ఈ సీజన్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఐపీఎల్ 2023 ఎనిమిదో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చివరి బంతికి 5 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. మొదట కెప్టెన్ శిఖర్ ధావన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ల దూకుడైన బ్యాటింగ్..

IPL 2023, RR vs PBKS: పోరాడి ఓడిన శామ్సన్‌ సేన.. సూపర్‌స్పెల్‌తో పంజాబ్‌ను గెలిపించిన నాథన్ ఎల్లిస్
Rr Vs Pbks
Follow us
Basha Shek

|

Updated on: Apr 06, 2023 | 5:25 AM

తొలిసారిగా ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోన్న గౌహతిలో ఈ సీజన్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఐపీఎల్ 2023 ఎనిమిదో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చివరి బంతికి 5 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. మొదట కెప్టెన్ శిఖర్ ధావన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ల దూకుడైన బ్యాటింగ్, ఆ తర్వాత నాథన్ ఎల్లిస్ గేమ్-ఛేంజింగ్ స్పెల్ తో పంజాబ్ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. రాజస్థాన్‌ విజయానికి చివరి ఓవర్ లో 16 పరుగులు అవసరం కాగా.. ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి తన జట్టును గెలిపించాడు. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగుల మాత్రమే చేసింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌(42), షిమ్రోన్ హెట్మెయర్ (36), ధ్రువ్‌ జురెల్ (32 నాటౌట్‌) పోరాడినా రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. పంజాబ్‌ బౌలర్ నాథన్‌ ఎల్లిస్‌ 4 వికెట్లు తీసి పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికే ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే యశస్వి (11) సిక్సర్‌ కొట్టినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. మరో ఓపెనర్‌గా వచ్చిన అశ్విన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారమంతా కెప్టెన్‌ శామ్సన్‌, బట్లర్‌లపై పడింది. అయితే బట్లర్ (19) కూడా త్వరగానే ఔట్‌ కావడం, దేవదత్ పడిక్కల్‌ (21) నిదానంగా ఆడడంతో రన్‌రేట్‌ భారీగా పెరిగిపోయింది. రియాన్‌ పరాగ్‌ (20), హెట్మెయర్ (36), ధ్రువ్‌ జురెల్ (32 నాటౌట్‌) మెరుపు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. అంతకుముందు పంజాబ్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేసింది. కెప్టెన్‌ శిఖర్ ధావన్( 56 బంతుల్లో 86 పరుగులు నాటౌట్ ; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్(34 బంతుల్లో 60 పరుగులు ; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. జితేశ్‌ శర్మ (16 బంతుల్లో 27) ఆఖర్లో దూకుడుగా ఆడి పంజాబ్‌కు భారీ స్కోరు అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..