చిరుతలా పరిగెత్తి.. గాలిలోకి డైవ్‌ చేస్తూ ఇషాన్‌ సూపర్‌ క్యాచ్‌.. ధోనిని గుర్తుచేశావంటూ ఫ్యాన్స్ ప్రశంసలు

ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపునకు ఆటగాళ్ల ఫీల్డింగ్‌ కూడా ఒక కారణం. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్‌, వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ చిరుతపులిలా కదులుతూ పట్టిన క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌ గా నిలిచింది.

చిరుతలా పరిగెత్తి.. గాలిలోకి డైవ్‌ చేస్తూ ఇషాన్‌ సూపర్‌ క్యాచ్‌.. ధోనిని గుర్తుచేశావంటూ ఫ్యాన్స్ ప్రశంసలు
Ishan Kishan
Follow us
Basha Shek

|

Updated on: Jan 04, 2023 | 8:55 AM

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టులో దీపక్ హుడా, అక్షర్ పటేల్ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులేమీ చేయలేదు. అయితే బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం, వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో భారత జట్టు విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపునకు ఆటగాళ్ల ఫీల్డింగ్‌ కూడా ఒక కారణం. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్‌, వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ చిరుతపులిలా కదులుతూ పట్టిన క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌ గా నిలిచింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 8 ఓవర్‌లో ఉమ్రాన్‌ వేసిన బంతిని చరిత్‌ అసలంక భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఎడ్జ్‌ తీసుకోవడంతో బంతి గాలిలో ఫైన్ లెగ్ వైపు వెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న హర్షల్‌ పటేల్‌ క్యాచ్‌ పట్టడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే అంతకుముందే కీపర్‌ ఇషాన్‌ కిషన్ చిరుతలా పరిగెత్తాడు. హర్షల్‌ను ఆగిపోమ్మని సైగ చేశాడు. గాలిలోకి డైవ్‌ చేస్తూ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. దీంతో అసలంక 12 పరుగులకే పెవిలియన్‌ చేరుకున్నాడు. ఇదిలా ఉంటే కిషన్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్లో అయితే ఇషాన్‌ ఫీట్‌ను చూసి కెప్టెన్‌ హార్దిక్‌ కూడా నమ్మలేకపోయాడు. నవ్వుతూ ఉండిపోయాడంతే. ఇషాన్ కిషన్ అందుకున్న ఈ అద్భుతమైన క్యాచ్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇటీవలి కాలంలో వికెట్ కీపర్ పట్టిన అత్యుత్తమ క్యాచ్ ఇదని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. అలాగే ధోనిని గుర్తుచేశావంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

బ్యాటింగ్‌లోనూ..

వికెట్‌ కీపర్‌గా వికెట్ల వెనక అద్భుతం చేసిన ఇషాన్‌ బ్యాటింగ్‌లోనూ రాణించాడు. ఇన్నింగ్స్‌ ప్రారంభంలో లంక బౌలర్లను చీల్చిచెండాడి పరుగుల వర్షం కురిపించాడు. దీపక్ హుడా తర్వాత ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (37) దే అత్యధిక స్కోరు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సహాయంతో ఈ స్కోరు సాధించాడు.. హుడా అజేయంగా 41 పరుగులు చేశాడు. అదే సమయంలో అక్షర్ పటేల్ 31 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్యా 29 పరుగులు చేశాడు. వీరు మినహా మరే భారత బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ రెండంకెల స్కోరును కూడా దాటలేకపోయారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ గురువారం (జనవరి 5)న జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..