వరల్డ్‌కప్‌లో తుస్సుమన్నాడు.. టెస్టుల్లో 480 పరుగులు బాదేశాడు.. కట్ చేస్తే 125 ఏళ్ల రికార్డు బ్రేక్..

ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో వరుస సెంచరీలతో కదంతొక్కాడు.

వరల్డ్‌కప్‌లో తుస్సుమన్నాడు.. టెస్టుల్లో 480 పరుగులు బాదేశాడు.. కట్ చేస్తే 125 ఏళ్ల రికార్డు బ్రేక్..
Harry Brook
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 20, 2022 | 8:30 AM

ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో వరుస సెంచరీలతో కదంతొక్కాడు. మొదటిగా టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపికైన బ్రూక్.. ఆ సమయంలో పేలవ ప్రదర్శన కనబరిచాడు. అయితేనేం తన ఎంపిక సరైనదేనని నిరూపిస్తూ పాక్ పర్యటనలో సత్తా చాటాడు. దెబ్బకు 125 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు.

హ్యారీ బ్రూక్.. ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌లు 6 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు చేయడమే కాదు.. ఈ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక రన్ గెట్టర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. అతడు ఆరు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి మొత్తంగా 480 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మూడు శతకాలు కూడా బ్రూక్ పాకిస్థాన్‌పై కొట్టడం విశేషం. ఇంతకముందు ఇంగ్లాండ్‌ తరపున కేఎస్‌ రంజిత్‌సింగ్హ్జి 125 ఏళ్ళ క్రితం 6 ఇన్నింగ్స్‌లలో 418 పరుగులు చేయగా.. ఆ తర్వాత టిప్‌ ఫోస్టర్‌ 411 పరుగులు చేశారు. ఇప్పుడు బ్రూక్ వీరిద్దరి రికార్డులను బ్రేక్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు.