IND vs SL:ముంబై మ్యాచ్‌లో మార్మోగిన పంత్‌ పేరు.. మైదానంలో లేకున్నా మా గుండెల్లో ఉన్నావంటూ ఫ్యాన్స్ హంగామా

మ్యాచ్‌ సాగుతున్నంత సేపు అభిమానులు రిషబ్‌ పంత్‌ పేరుతో నినాదాలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. అతని పోస్టర్లు, ఫొటోలను ప్రదర్శిస్తూ తెగ హంగామా చేశారు. పంత్ త్వరగా కోలుకోవాలి. మళ్లీ టీమిండియాలోకి రావాలంటూ క్రికెట్‌ ఫ్యాన్స్ ప్రదర్శించిన బ్యానర్లు, పోస్టర్లు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

IND vs SL:ముంబై మ్యాచ్‌లో మార్మోగిన పంత్‌ పేరు.. మైదానంలో లేకున్నా మా గుండెల్లో ఉన్నావంటూ ఫ్యాన్స్ హంగామా
Ind Vs Sl Match
Follow us
Basha Shek

|

Updated on: Jan 04, 2023 | 12:19 PM

మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమ్ ఇండియా 2023ను విజయంతో ఆరంభించింది. కాగా మ్యాచ్‌ సాగుతున్నంత సేపు అభిమానులు రిషబ్‌ పంత్‌ పేరుతో నినాదాలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. అతని పోస్టర్లు, ఫొటోలను ప్రదర్శిస్తూ తెగ హంగామా చేశారు. పంత్ త్వరగా కోలుకోవాలి. మళ్లీ టీమిండియాలోకి రావాలంటూ క్రికెట్‌ ఫ్యాన్స్ ప్రదర్శించిన బ్యానర్లు, పోస్టర్లు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా గత శుక్రవారం కారు ప్రమాదానికి గురైన పంత్ ప్రస్తుం డెహ్రాడూన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జాతీయరహదారిపై పంత్ కారు కంట్రోల్‌ తప్పి ఘోర ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్‌లో అతని తల, వీపు, మోకాల, చీలమండపై తీవ్ర గాయాలయ్యాయి. వీటి నుంచి కోలుకోవాలంటే సుమారు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో ఇన్ని రోజుల పాటు పంత్‌ క్రికెట్‌ ఫీల్డ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే రిషబ్‌ మైదానంలో లేకపోయినా తమ గుండెల్లో ఉన్నాడంటూ అభిమానులు ముంబై మ్యాచ్‌లో హల్‌చల్‌ చేశారు.

పంత్ యాక్సిడెంట్‌పై గంగూలీ..

వాంఖడే స్టేడియంకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో చాలా మంది అభిమానులు రిషబ్ పంత్ పేరుతో నినాదాలు చేయడం మనం చూడవచ్చు. అదే సమయంలో, కొంతమంది అభిమానులు చేతిలో ‘గెట్ వెల్ సూన్ రిషబ్ పంత్’ అని రాసి ఉన్న ప్లకార్డులతో కనిపించారు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పంత్‌ ప్రమాదంపై స్పందించారు. త్వరలోనే అతను ఢిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌గా నియమితులు కానున్నారనే వార్తల నేపథ్యంలో పంత్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ‘జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతుంటాయి. వాటిని అధిగమించి మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పంత్ త్వరగా కోలుకుని తిరిగి మైదానంలోకి అడుగపెడతాడని ఆశిస్తున్నాను’ అని గంగూలీ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..