Video: వామ్మో ఇదేం బౌలింగ్ సామీ.. దెబ్బకు మిడిల్ వికెట్ విరిగిపోయిందిగా.. షాక్‌లో బ్యాట్స్‌మెన్.. వీడియో..

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఒక ఆటగాడికి ఐఫోన్ 14తోపాటు, ఓ ప్లాట్‌ బహుమతిగా లభించింది. ఓ మ్యాచ్‌లో విజయం సాధించినందుకుగానూ అతని సొంత ఫ్రాంచైజీ ద్వారా ఈ అవార్డు లభించింది. కానీ, ఈ అవార్డు అందుకున్న తర్వాతి మ్యాచ్‌లో అతనికి మైదానంలో ఘోరమైన షాక్ తగిలింది.

Video: వామ్మో ఇదేం బౌలింగ్ సామీ.. దెబ్బకు మిడిల్ వికెట్ విరిగిపోయిందిగా.. షాక్‌లో బ్యాట్స్‌మెన్.. వీడియో..
Psl 2023 Viral
Follow us
Venkata Chari

|

Updated on: Feb 28, 2023 | 3:11 PM

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఒక ఆటగాడికి ఐఫోన్ 14, ఓ ప్లాట్‌ బహుమతిగా లభించింది. ఓ మ్యాచ్‌లో విజయం సాధించినందుకుగానూ అతని సొంత ఫ్రాంచైజీ ద్వారా ఈ అవార్డు లభించింది. కానీ, ఈ అవార్డు అందుకున్న తర్వాతి మ్యాచ్‌లో అతనికి మైదానంలో ఘోరమైన షాక్ తగిలింది. ఆయన పేరు ఫఖర్ జమాన్. లాహోర్ క్వలండర్స్ ఫ్రాంచైజీ తరపున పీఎస్ఎల్‌ 2023లో భాగమయ్యాడు. అంతకుముందు జరిగిన ఓ మ్యాచ్‌లో 96 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఫ్రాంచైజీ నుంచి భారీ బహుమతిని అందుకున్నాడు. ఈ బహుమతి అందుకున్న తర్వాత తదుపరి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా మారింది.

ఆ మ్యాచ్‌లో సెంచరీని కోల్పోయిన తర్వాత ఫఖర్ జమాన్ ఐఫోన్ 14, ప్లాట్‌ను గెలుచుకున్నాడు. అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లో, బౌలర్ అతని మిడిల్ స్టంప్‌ను మధ్య నుంచి విరగ్గొట్టాడు. ఇది ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో కనిపించింది. లాహోర్ క్వాలండర్స్ భారీ తేడాతో గెలిచింది. అయితే ఫఖర్ జమాన్ మధ్యలో స్టంప్ విరిగిపోవడంతో వీడియో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

టామ్ కరణ్ అద్భుత బంతికి విరిగిపోయిన మిడిల్ స్టంప్..

ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన సామ్ కరణ్ సోదరుడు టామ్ కరణ్.. తన అద్భుతమైన బంతితో ఫఖర్ జమాన్ మిడిల్ స్టంప్‌ను విరగ్గొట్టాడు. బంతి చాలా వేగంగా వచ్చింది. ఫఖర్ జమాన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్‌కు తాకి, నేరుగా వికెట్లను తాకింది. దీంతో మిడిల్ వికెట్ విరిగిపోయింది.

అలానే చూస్తుండిపోయిన ఫఖర్ జమాన్..

మిడిల్ వికెట్ రెండుగా విరిగిపోవడంతో ఫఖర్ జమాన్ ఆశ్యర్యపోయాడు. టామ్ కరణ్ ఆనందానికి అవధులు లేవు. ఒకే బంతికి సంబంధించిన రెండు కథలు ఇలా ఉన్నాయి. ఒకవైపు బౌలర్‌ ఆనందం, మరోవైపు బ్యాట్స్‌మన్‌ ఏమైందో తెలియక ఆలోచిస్తూనే ఉండిపోయాడు. ఫఖర్ జమాన్ 36 పరుగులు చేసి ఔటయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..