TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు పండగలాంటి వార్త.. నడిచి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా..
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభ వార్త తెలిపింది. ఇకపై తిరుమలకు కాలి నడకన వెళ్లే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. కరోనా సమయానికి ముందు తిరుమలకు నడిచే వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. కాలి నడక మధ్య..
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభ వార్త తెలిపింది. ఇకపై తిరుమలకు కాలి నడకన వెళ్లే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. కరోనా సమయానికి ముందు తిరుమలకు నడిచే వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. కాలి నడక మధ్య మార్గంలో ఈ టోకెన్లను అందించే వారు. అయితే కరోనా సమయంలో టీటీడీ ఈ టోకెన్ల జారీని నిలిపివేసింది. తాజాగా మళ్లీ నడిచి వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం తెలిపారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన సమీక్షావేశంలో పాల్గొన్న ఛైర్మన్ ఈ విషయాలను వెల్లడించారు. అలిపిర నడక దారిలో 10 వేల టోకెన్లు, శ్రీవారి మెట్టు నడకదారిలో రోజుకు 5వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఇక వేసవిలో బ్రేక్ సిఫారసు లెటర్స్‌ని తగ్గిస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే తిరుమలలో గదుల కేటాయింపు విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తామని తెలిపారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో పారదర్శకంగా వసతి సౌకర్యం కేటాయింపులు చేయనున్నట్టు పేర్కొన్నారు. వేసవిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందుల లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..