శ్రీవారి భక్తులకు తిపి కబురు..! తిరుమల ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం

టీటీడీ ఈ గోడౌన్లు కోల్డ్ స్టోరేజీ ఆధునీకరణకు రూ.14 కోట్లు, తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.12 కోట్లు కేటాయిచింది. అలానే తిరుపతి విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగిస్తూ అవసమైన శాశ్వత ఉద్యోగులను నియమించాలని టీటీడీ నిర్ణయించింది.

శ్రీవారి భక్తులకు తిపి కబురు..! తిరుమల ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం
TTD NEWS
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 15, 2023 | 7:24 PM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలోని శ్రీనివాస సేతును త్వరగా పూర్తి చేయాలని, ఢిల్లీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తరహాల్లోనే బ్రహ్మోత్సవాలు జరపాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారానే చేయలని నిర్ణయించారు.

టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సేంద్రియ, ప్రకృతి ద్వారా చేయబడిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే భక్తులకు కూడా ప్రకృతి వ్యవసాయంతో తయారు చేసిన లడ్డు ప్రసాదాలను అందించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టీటీడీ ఈ గోడౌన్లు కోల్డ్ స్టోరేజీ ఆధునీకరణకు రూ.14 కోట్లు, తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.12 కోట్లు కేటాయిచింది. అలానే తిరుపతి విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగిస్తూ అవసమైన శాశ్వత ఉద్యోగులను నియమించాలని టీటీడీ నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..