Maha Shivaratri 2021: మహాశివరాత్రి విశిష్టత.. సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి చెప్పిన శివరాత్రి కథ..

భోళా శంకరుడు, అభిషేక ప్రియుడు, నీలకంఠుడు, ఈశ్యరుడు, రాజేశ్వరుడు ఇలా ఎన్నో నామాలు ఆ పరమేశ్వరుడి. సర్వ జగత్తును పాలించే

Maha Shivaratri 2021: మహాశివరాత్రి విశిష్టత.. సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి చెప్పిన శివరాత్రి కథ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 11, 2021 | 7:27 AM

భోళా శంకరుడు, అభిషేక ప్రియుడు, నీలకంఠుడు, ఈశ్యరుడు, రాజేశ్వరుడు ఇలా ఎన్నో నామాలు ఆ పరమేశ్వరుడి. సర్వ జగత్తును పాలించే ఆ శివుడుకి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈరోజున శివుడికి బిల్వపత్రాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివుడికి సమర్పిస్తుంటాం. ఇప్పటి వరకు మహాశివరాత్రి గురించి ఎన్నో కథలను వినుంటాం. కానీ మహశివరాత్రి వెనుక ఆంతార్యం మాత్రం ఇప్పటికీ వివరణ సందేహమే. అయితే ఈ మహాశివరాత్రి కథ గురించి సాక్ష్యాత్తు పరమశివుడే తన సతీమణి పార్వితిదేవికి చెప్పినట్లుగా లింగపురాణంలో ఓ కథ మనకు కన్పిస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అయితే ఒకరోజు ఏ జంతువు దొరకలేదు. తీవ్ర నిరాశతో తిరిగి ఇంటికి వస్తున్న అతనికి దారిలో ఓ సరస్సు కనిపించింది. దీంతో వెంటనే తనకు ఓ ఆలోచన వచ్చింది. రాత్రి సమయంలో ఏదైన జంతువు నీళ్ళు తాగడానికి అక్కడకు వస్తుందేమో అని.. అప్పుడు దాన్ని పట్టుకోవచ్చని.. ఆ పక్కనే ఉన్న చెట్టుపై కూర్చున్నాడు. ఇక తనకు శివ శివ అని పలకడం అలవాటు. ఆ రాత్రంతా ఆ పేరును జపిస్తూ ఉండిపోయాడు. అయితే ఆ రోజు శివరాత్రి అని అతనికి తెలియదు. ఇక ఆ సమయంలో ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాగా.. ఆ జింక తాను గర్భం దాల్చానని.. తనను చంపటం అధర్మమంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడింది.  ఆ జింక మానవభాష మాట్లాడేసరికి బోయవాడు దానిని వదిలిపెట్టాడు. ఆ తర్వాత అటువైపు మరో ఆడ జింక వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపల అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూన్నానని.. పైగా బక్కచిక్కిన తన శరీరమాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరికాసేపటి దాకా ఏ జంతువూ దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకొంది. కాసేపటి తర్వాత అటువైపు వచ్చిన ఒక మగ జింక అతడికి కనిపించింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయనడిగింది. బోయవాడు వచ్చాయని తనకు ఏ జంతువూ దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగ జింకకు చెప్పాడు. అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని అప్పుడు తనను సంహరించమని చెప్తుంది.

ఇక ఉదయం మరొక జింక.. దాని పిల్ల అటుగా రావటం కనిపించింది. అది చూసిన బోయవాడి బాణం ఎక్కుపెట్టడం చూసిన జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది. మరికొద్దిసేపటికి నాలుగు జింకలూ బోయవాడికిచ్చిన మాటప్రకారం సత్యనిష్ఠతో వాడిముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్సవర్తన బోయబాడిలో పరివర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టుకావటం, అతడు తెలియకుండానే శివ శివా అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం.. తన చూపునకు అడ్డంవచ్చిన మారేడు దళాలను కోసి కిందపడవేయటం చేశాడు బోయవాడు. ఆ చెట్టుకిందనే ఓ శివలింగం ఏనాటితో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజాఫలితాన్ని ఇచ్చింది. నాలుగో జాము వరకూ మెలకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. ఆ జింకలు కూడా సత్యనిష్ఠతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు.

Also Read:

Maha shivaratri 2021: శివాలయాన్ని తనలో దాచుకునే సముద్రం.. ఆ కొన్ని గంటలు మాత్రమే దర్శనం.. ఎక్కడుందో తెలుసా..