Srilakshmi C |
Updated on: Mar 20, 2023 | 7:40 PM
కప్పు బియ్యం తీసుకుని ముందుగా శుభ్రం చేసుకోండి. ఈ తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి గంటసేపు బియ్యం నానబెట్టాలి.
తర్వాత నీళ్లలో నానిన బియ్యం పక్కకు తీసిపెట్టుకుని, ఆ నీళ్లను ఒక స్ప్రే బాటిల్‌లోకి తీసుకుని తలస్నానం అయ్యాక తలంతా ఆ నీటిని స్ప్రే చేసుకొవాలి.
పావు గంటసేపు అలాగే ఉంచుకుని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. బియ్యం నానబెట్టిన నీళ్లలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అమైనో యాసిడ్స్, న్యూట్రియంట్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలపడటంతోపాటు వెంట్రుకలు తెగడం, చిట్లడం వంటి సమస్యలు దూరమవుతాయి.