Vivo y77t: వివో నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌.. ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్స్‌ నెవ్వర్‌ బిఫోర్‌

ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ విస్తరిస్తున్న తరుణంలో రోజుకో 5జీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. రూ. 20 వేలలోపే 5జీ ఫోన్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివోవై77టీ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ త్వరలోనే ఇండియాలోకి రానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Aug 22, 2023 | 5:14 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివోవై77టీ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 16,000 కాగా 12 జీబీ ర్యామ్‌+256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 18,000గా ఉంది.

1 / 5
ప్రస్తుతం చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే ఇండియాలోకి లాంచ్‌ చేయనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.64 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించారు. 2388 x 1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ ఫోన్‌ స్క్రీన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

2 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 ఎస్‌ఓసీ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆరిజిన్‌ ఓస్‌3ని ఇచ్చారు.

3 / 5
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్+2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీల కోసం ఇందులో 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 44 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే యూఎస్‌బీ టైప్‌సి ఛార్జింగ్‌ పోర్ట్‌ను అందించారు. బ్లూటూత్‌ 5.2 కనెక్టివిటీ ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేకత.

5 / 5
Follow us