చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ 11 పేరుతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్ ధర విషయానికొస్తే చైనాలో 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 18,000, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ధర రూ. 20,600గా ఉంది. ఇక ఇండియా విషయానికొస్తే రూ. 20,000లోపు ఉండే అవకాశం ఉంది.