Moto e13: రూ. 9 వేలకే మోటో నుంచి స్మార్ట్ ఫోన్‌.. ఆటో స్మైల్‌ క్యాప్చర్‌ వంటి అధునాతన ఫీచర్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ మోటరోలా ఇటీవల బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ కొత్త ఫోన్స్‌ను తీసుకొస్తోంది. ముఖ్యంగా రూ. 10 వేలలోపు ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మోటో ఈ13 ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నిజానికి ఈ స్మార్ట్ ఫోన్‌ ఇప్పటికే లాంచ్‌ కాగా తాజాగా స్టోరేజ్‌ను అప్‌డేట్ చేసి మళ్లీ విడుదల చేసింది. ఆగస్టు 16వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్‌ సేల్ ప్రారంభం కానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

|

Updated on: Aug 15, 2023 | 10:48 AM

మోటరోలా మోటో ఈ13 స్మార్ట్ ఫోన్‌ స్టోరేజ్‌ను అప్‌డేట్‌ చేసి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో లాంచ్‌ చేశారు. మోటరోలా కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు, అన్ని ఈ కామర్స్‌ సైట్స్‌లో అందుబాటులో ఉంది.

1 / 5
కాస్మిక్‌ బ్లాక్‌, అరోరా గ్రీన్‌, క్రీమీ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 8,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో యూనిఎస్‌ఓసీ టీ606 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను అందించారు. ఇక 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. యూఎస్‌బీ టైప్‌ సీ చార్జింగ్‌ పోర్ట్‌ను ఇచ్చారు.

3 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్ కోసం ఐపీ52 రేటింగ్ ఇచ్చారు.

4 / 5
ఇక కెమెరాలో ప్రత్యేకంగా ఏఐ-పవర్డ్‌ కెమెరా సిస్టమ్‌ను అందించారు. దీంతో ఆటో స్మైల్ క్యాప్చర్‌ వంటి వంటి ఇంటెలిజెంట్ ఫీచర్‌లు, ఫేస్‌ బ్యూటీ, పోర్ట్రెయిట్ మోడ్‌ వంటి అధునాతన ఫీచర్స్‌ అందించారు.

5 / 5
Follow us
Most Read Stories