Moto G14: మరో రెండు కొత్త కలర్స్‌లో మోటో జీ14.. రూ. పది వేలకే ఇన్ని ఫీచర్స్ ఏంటి అసలు
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ మోటరోలా ప్రస్తుతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తీసుకొచ్చిందే మోటీ జీ 14. ఆగస్టులో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ ఫోన్స్ హాట్ కేక్స్‌లా అమ్ముడుపోయాయి. దీనికి కారణం.. ఈ ఫోన్ ధరే. కేవలం రూ. 10 వేలలో మంచి ఫీచర్స్‌తో తీసుకురావడంతో యూజర్లు పెద్ద ఎత్తున ఈ ఫోన్‌కు అట్రాక్ట్ అయ్యారు. దీంతో కంపెనీ కూడా యూజర్లను మరింత అట్రాక్ట్ చేసే క్రమంలో తాజాగా ఈ ఫోన్‌ను మరో రెండు కొత్త కలర్స్‌లో తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..