LG StanbyME Go: సూట్‌కేస్‌లా కనిపిస్తోన్న ఈ గ్యాడ్జెట్‌ స్మార్ట్ టీవీ అంటే నమ్ముతారా.?

స్మార్ట్ యుగంలో రోజుకో కొత్త గ్యాడ్జెట్ అందుబాటులోకి వస్తోంది. మారుతోన్న టెక్నాలజీ అనుగుణంగా కొంగొత్త ప్రాడక్ట్స్‌ హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఎల్‌జీ మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్‌ను తీసుకొచ్చింది. చూడ్డానికి అచ్చంగా సూట్ కేసులా కనిపించే ఓ స్మార్ట్ టీవీని లాంచ్‌ చేసింది. దీనికి సూట్‌ కేస్‌ టీవీగా పిలస్తున్నారు. LG StanbyME Go పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ అసలు ఎలా పనిచేస్తుంది.? దీని ఫీచర్లు ఎలా ఉంటాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Aug 17, 2023 | 8:33 PM

LG StanbyME Go పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రొడక్ట్‌ సూట్‌కేస్‌ టీవీలా పనిచేస్తుంది. ఇందులో 27 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. 1080పీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. దీనిని 360 డిగ్రీలు తిప్పుకునే అవకాశం ఉంటుంది.

1 / 5
ఈ టీవీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3 గంటల వరకు పనిచేస్తుంది. 20 వాట్‌ స్పీకర్‌లను ఇచ్చారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్స్‌ ఈ సూట్‌కేస్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ సూట్‌కేస్‌ వెబ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.

2 / 5
యాపిల్ ఎయిర్‌ప్లే, బ్లూటూత్‌, వైఫై సపోర్ట్ వంటి ఫీచర్స్‌ అందించారు. ముఖ్యంగా అవుట్‌ డోర్స్‌కి, పిక్‌నిక్‌ వెళ్లే సమయంలో ఈ టీవీ ఉపయోగపడుతుంది.

3 / 5
సూట్‌కేస్‌ను ఓపెన్‌ చేస్తే టీవీగా మారిపోతుంది. ప్రస్తుతం ఈ టీవీ అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ముందస్తు బుకింగ్స్‌ను ప్రారభించింది.

4 / 5
ధర విషయానికొస్తే ఈ సూట్‌కేస్‌ టీవీ ధర ఇండియన్‌ కరెన్సీలో రూ. 83,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో అందుబాటులో ఉన్న ఈ సూట్‌కేస్‌ టీవీ త్వరలోనే భారత్‌లో రానుంది.

5 / 5
Follow us