Best Phones Under 25k: స్టైలిష్ లుక్‌తో కేకపెట్టిస్తున్న 5జీ ఫోన్లు ఇవే.. ఏకంగా 108ఎంపీ కెమెరా సెటప్‌‌తో సెన్సేషన్.. 

మన దేశంలో టెక్ రంగంలో అత్యధికంగా అమ్ముడయ్యే గ్యాడ్జెట్ స్మార్ట్ ఫోన్. కొత్త మోడళ్లకు కొదువలేదు. ప్రతి వారం ఏదో ఒక మొబైల్ లాంచ్ అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో మనం మంచి ఫోన్ మన బడ్జెట్లో ఎంపిక చేసుకోవడం కొంచెం కష్టమైన పనే. అందుకే మీకోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్ల జాబితాను మేం తయారు చేశాం. మంచి స్టైలిష్ లుక్ తో పాటు, అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన పనితీరుతో ఆకట్టుకునే స్మార్ట్ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి ధర కూడా మీకు అందుబాటులోనే కేవలం రూ. 25,000 ధరలోపే ఉంటుంది. రండి ఓ లుక్కేయండి..

Madhu

|

Updated on: Apr 22, 2023 | 5:30 PM

వన్ ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్ 5జీ(OnePlus Nord CE 3 Lite 5G).. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఏకంగా 108ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ ఇందులో ఉంటాయి. వన్ ప్లస్ బ్రాండ్ మొత్తం మీద అత్యంత భారీ సెన్సార్ కలిగిన ఫోన్ ఇదే. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే సూపర్ వీఓఓసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAhలో బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ.21,999గా ఉంది.

1 / 5
రియల్ మీ 10ప్రో ప్లస్ 5జీ(Realme 10 Pro+ 5G).. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఉంటుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో కూడిన 5000mAh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఈ ఫోన్ లుక్ చాలా క్లాసీ ఉంటుంది. దీని ధర రూ.24,999గా ఉంది.

2 / 5
శామ్సంగ్ గేలాక్సీ ఏ23 5జీ(Samsung Galaxy A23 5G).. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ వెనుకవైపు 50ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ  ఉంటుంది. దీనిలో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000mAh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది.  ఈ ఫోన్ రక్ష కోసం గొరిల్లా గ్లాస్ 5, భద్రత కోసం  ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. దీని ధర రూ.22,999గా ఉంది.

3 / 5
జియోమీ రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ(Xiaomi Redmi Note 12 Pro 5G).. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 1080 ఎంటీ6877వీ చిప్ సెట్ తో వస్తుంది. దీనిలో 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాలా అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. ఐపీ53 స్ప్లాష్ రెసిస్టెన్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఈ ఫోన్ వస్తుంది. అలాగే 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ. 24,990గా ఉంది.

4 / 5
పోకో ఎక్స్ 5 ప్రో 5జీ(Poco X5 Pro 5G).. ఇది కూడా 108ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 778జీ చిప్ ద్వారా శక్తిని పొందుతుంది.120Hz రిఫ్రెష్ రేట్‌తో  6.67 అంగుళాల హెచ్ డీఆర్ 10 ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్, స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఇది డస్ట్, వాటర్ ప్రూఫింగ్ కోసం ఐపీ53 రేటింగ్‌తో వస్తుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని ధర ఆన్ లైన్ లో రూ.22,999గా ఉంది.

5 / 5
Follow us