Boult Smartwatch: బౌల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లు.. తక్కువ ధరలో వండర్‌ఫుల్‌ ఫీచర్స్‌

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. రోజుకో కొత్త మోడల్‌ మార్కెట్లో సందడి చేస్తోంది. రకరకాల బ్రాండ్స్‌ తక్కువ ధరకే మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ వాచ్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ బౌల్ట్‌ కొత్తగా రెండు స్మార్ట్ వాచ్‌లను లాంచ్‌ చేసింది. బౌల్ట్‌ క్రౌన్‌ R, డ్రిఫ్ట్‌ 2 పేర్లతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన ఈ వాచ్‌లను భారత మార్కెట్లో ఇటేవలే లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ వాచ్‌లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Aug 19, 2023 | 5:44 PM

బౌల్ట్‌ కంపెనీ కొత్త రెండు సూపర్ స్మార్ట్ వాచ్‌లను తీసుకొచ్చింది. క్రౌన్‌ ఆర్‌, డ్రిఫ్ట్‌ 2 పేర్లతో ఈ వాచ్‌లను ఇండియన్‌ మార్కెట్లోకి లాంచ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వాచ్‌లు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

1 / 5
బౌల్ట్‌ క్రౌన్‌ ఆర్‌ స్మార్ట్ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.52 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 600 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకత. ఇక ఈ వాచ్‌ ధర విషయానికొస్తే రూ. 2499గా ఉంది.

2 / 5
ఇక బౌల్ట్‌ డ్రిఫ్ట్‌ 2 స్మార్ట్ వాచ్‌ విషయానికొస్తే.. ఇందులో 1.85 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర రూ. 1499గా ఉంది. పింక్‌, బ్లూ, బ్లాక్‌ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

3 / 5
ఈ స్మార్ట్ వాచ్‌లోనూ 24×7 హార్ట్‌ బీట్‌ సెన్సార్, ఎస్‌పీఓ2 సెన్సార్, స్లీప్ ట్రాకర్‌తో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా పీరియడ్‌ ట్రాకర్‌ వంటి హెల్త్‌ ఫీచర్లను అందించారు.

4 / 5
అలాగే ఈ రెండింటిలో.. 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, రన్నింగ్, సైక్లింగ్, స్మార్ట్ నోటిఫికేషన్‌లు, రిమైండర్‌లు, సిరి, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. అలాగే డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌కోసం IP67 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.

5 / 5
Follow us