Poco m6 pro 5g: రూ. 10 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్‌.. ధరే తక్కువ ఫీచర్లు మాత్రం అదుర్స్‌

ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కంపెనీలు కూడా పెద్ద ఎత్తున 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇక కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్‌యంలో ఫోన్‌ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. తక్కువ ధరకే 5జీ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో తక్కువ ధరలోనే 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. పోకో ఎమ్‌6 ప్రో పేరుతో భారత్‌లో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత.? లాంటి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Aug 13, 2023 | 7:52 AM

పోకో ఎమ్‌6 ప్రో స్మార్ట్ ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో అందుబాటలో ఉంది. ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,999 కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 12,999గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ లెక్కన బేస్‌ వేరియంట్‌ రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు.

1 / 5
ఇదిలా ఉంటే ఈ స్మార్ట్‌ ఫోన్‌ తొలి రెండు సేల్స్‌లో విశేష ఆదరణ లభించింది. తక్కువ ధరలో 5జీ ఫోన్‌ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఫోన్‌ కోసం ఎగబడ్డారు. కేవలం 15 నిమిషాల్లోనే స్టాక్‌ మొత్తం అమ్ముడుపోయింది. త్వరలోనే మరో సేల్‌ను నిర్వహించనుంది.

2 / 5
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.79 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్మార్ట్ ఫోన్‌ డిస్‌ప్లే సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

3 / 5
ఆండ్రాయిడ్‌ 13 ఆపరేంటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు ఓఎస్ అప్‌డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో అదనంగా ర్యామ్‌ను మరో 6జీ వరకు పెంచుకోవచ్చు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ ఏఐ సెన్సార్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అంతేకాకుండా ఇందులో 18 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు.

5 / 5
Follow us