Acer tabs: బడ్జెట్‌ ధరలో ఎసర్ నుంచి సూపర్ ట్యాబ్స్‌.. ఫీచర్లు మాములుగా లేవుగా

ప్రస్తుతం టెక్‌ మార్కెట్లో అటు స్మార్ట్ ఫోన్స్‌తో పాటు ఇటు ట్యాబ్లెట్లకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఆన్‌లైన్‌ తరగతులకు అలవాటు పడడంతో ట్యాబ్స్‌ వినియోగం బాగా పెరిగింది. దీంతో కంపెనీలు ట్యాబ్స్‌ను కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఎసర్‌, ఇండియన్‌ మార్కెట్లోకి రెండు కొత్త ట్యాబ్స్‌ను తీసుకొచ్చాయి. ఎసర్‌ వన్‌ 10, ఎసర్‌ వన్ 8 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్లెట్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు చూద్దాం..

Narender Vaitla

|

Updated on: Aug 24, 2023 | 4:21 PM

ఎసర్‌ వన్‌ 10, ఎసర్ వన్‌ 8 పేరుతో తీసుకొచ్చిన ఈ రెండు ట్యాబ్లెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ధర విషయానికొస్తే ఎసర్‌ వన్‌ 10 మోడల్‌ 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 17,990 కాగా, ఎసర్‌ వన్ 8 3జీబీ ర్యామ్‌, 32 జీబీ వేరియంట్‌ ధర రూ. 12,990గా ఉంది.

1 / 5
ఈ రెండు ట్యాబ్స్‌ ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ ఎమ్‌టీ 8768 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తారు. ఇక ఎసర్‌ వన్‌ 8లో 8.7 ఇంచెస్‌ WXGA+ IPS డిస్‌ప్లేను అందించారు.

2 / 5
ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు, అలాగే సెల్ఫీల కోసం 2 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 5100 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ట్యాబ్‌లో ఇచ్చారు.

3 / 5
ఎసర్‌ వన్ 10 మోడల్‌లో 10.1 ఇంచెస్‌ WUXGA ఐపీఎస్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా, 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

4 / 5
 ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 7000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ఈ రెండు ట్యాబ్స్‌ ఆండ్రాయిడ్‌ 12 ఆన్‌బోర్డ్‌తో రన్‌ అవుతాయి. బ్లూటూత్ 5.0, USB టైప్-C చార్జింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

5 / 5
Follow us