ఎలుకలను ఆహారంగా తీసుకోవడం అనేది భారత్‌లోని బీహార్ వంటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎలుక మాంసానికి అభిమానులు ఉన్నారు. చైనీయులు క్రీస్తుశకం 618-907 కాలం నుంచీ ఎలుకలను ఆహారంగా తింటున్నారు. భారత్‌తోపాటు కంబోడియా, ఇండోనేసియా, థాయిలాండ్, ఘానా, చైనా, వియత్నాం.. ఇతర దేశాల్లో ఎలుక మాంసాన్ని ఇష్టంగా తింటారు.