Pollen allergy: పుప్పొడి అలర్జీతో ఇబ్బందిపడుతున్నారా.. అయితే చికిత్స మీ కోసమే..
సీజన్ల బట్టి అలర్జీలు వస్తుంటాయి. కొందరు సీజన్ తో సంబంధం లేకుండా అలర్జీల బారిన పడుతుంటారు. ముఖ్యంగా దుమ్ము, ధూళి, పూలు, కాలుష్యం, చల్లటి వాతావరణం కారణంగా అలర్జీలు వస్తాయి. అయితే వీటిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కొందరిలో ఇవే చాలా ఇబ్బందిని కలుగుజేస్తాయి. ముఖ్యంగా పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు తీవ్ర అలర్జీలకు కారణమవుతాయి. ముఖ్యంగా చెట్లన్నీ పూలు పూసే వసంత కాలంలో గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. ఇది గాలి ద్వారా ముక్కల్లోకి ప్రవేశించి అలర్జీని కలిగిస్తాయి.