Vande Bharat Express: సికింద్రాబాద్ టు తిరుపతి.. ఇక ఎనిమిదిన్నర గంటల్లోనే.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు నెలల స్వల్ప వ్యవధిలో తెలంగాణ నుంచి ప్రారంభం కానున్న రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు మూడున్నర గంటలు తగ్గిస్తుంది.

Shaik Madar Saheb

|

Updated on: Apr 08, 2023 | 7:00 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు నెలల స్వల్ప వ్యవధిలో తెలంగాణ నుంచి ప్రారంభం కానున్న రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రైలు రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు మూడున్నర గంటలు తగ్గిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల  యాత్రికుల ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భారతదేశ స్వదేశీ సెమీ-హై స్పీడ్ రైలు ఐటి సిటీ హైదరాబాద్‌.. తిరుపతి మధ్య పరుగులు తీయనుంది.

1 / 7
ఈ పర్యటనలో ప్రధాని మోడీ హైదరాబాద్ - సికింద్రాబాద్ జంటనగర ప్రాంతంలోని సబర్బన్ విభాగంలో 13 కొత్త ఎంఎంటి ఏస్ సర్వీసులను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (ఎంఎంటి ఏస్) జంట నగర ప్రాంతంలోని ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ కొత్త రైలు సర్వీసులు జంట నగరాలలోని ప్రజలకు తక్కువ ఖర్చుతో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తాయి.

2 / 7
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో స్టాప్‌లను కలిగి ఉంది. అయితే ఇది నగరాల మధ్య 660 కిమీ ప్రయాణాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు మొదటిరోజు.. సికింద్రాబాద్‌లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి 10 స్టాప్‌లలో ఆగి.. చివరి గమ్యస్థానమైన తిరుపతి రైల్వే స్టేషన్‌కి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు 8 గంటల 30 నిమిషాల వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకోనుంది. సికింద్రాబాద్‌ - తిరుపతి ఛైర్‌కార్‌ టికెట్ ధర రూ. 1680 గా నిర్ణయించారు.

3 / 7
Vande Bharat Express: సికింద్రాబాద్ టు తిరుపతి.. ఇక ఎనిమిదిన్నర గంటల్లోనే.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే..?

4 / 7
కాగా, విజయవాడ-చెన్నై వందేభారత్ రైలుకు మొదట వేరే రూట్ ఎంచుకోగా.. తిరుపతి మీదుగా నడిపితే ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని రైల్వే శాఖ భావించింది. దీంతో వయా రేణిగుంట నడపాలని విజయవాడ డివిజన్ అధికారులు.. దక్షిణ మధ్య రైల్వేను కోరిన విషయం విదితమే.

5 / 7
వీటితో పాటు  రూ 720 కోట్ల నిధులతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా ప్రధాన మంత్రి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో ప్రయాణికుల రాకపోకల పరంగా అతిపెద్ద స్టేషన్‌గా ఉన్న ఈ స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దేందుకు స్టేషన్ భవనాన్ని భారీ ఎత్తున మార్పులు చేయనున్నారు.

6 / 7
పునరాభివృద్ది కానున్న సికింద్రాబాద్ స్టేషన్‌లో విశాలమైన డబుల్-లెవల్ రూఫ్ ప్లాజా తో పాటు రిటైల్ షాపులు, ఫలహారశాలలు, వినోద సౌకర్యాలు, ప్రయాణీకుల రాక/నిష్క్రమణలు వేర్వేరుగా, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లు, ట్రావెలేటర్‌లు, మల్టీలెవల్ కార్ పార్కింగ్ వంటి ఎన్నో సౌకర్యాలతో పాటు రైలు ఎక్కావల్సిన, దిగవలసిన ప్రయాణికులకు అంతరాయం లేకుండా ఇతర  రవాణా మార్గాలతో మల్టీమోడల్ కనెక్టివిటీ అందించనుందని. దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

7 / 7
Follow us