Women’s Day: మన చట్టంలో స్త్రీలకు 6 నెలల సెలవులతో సహా 5 ప్రధాన హక్కులకు అర్హులు.. అవి ఏమిటో తెలుసుకోండి

భారత రాజ్యాంగం లైంగిక వేధింపుల కేసుల్లో ఉచిత న్యాయ సహాయం పొందే హక్కును మహిళలకు కల్పించింది. బాధితురాలు కోరుకుంటే, ఆమె పోలీస్ స్టేషన్‌లోని SHO నుండి సహాయం పొందవచ్చు.

Surya Kala

|

Updated on: Mar 07, 2023 | 7:22 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023: ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద వేదికలపై కూడా స్త్రీ, పురుషుల సమానత్వంపై తరచుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ నేటికీ  సమాజంలో అనేక చోట్ల అసమానతలు కనిపిస్తునే ఉన్నాయి. మన దేశంలో మహిళల అభివృద్ధి పథంలో పయనించేలా అనేక రకాల రిజర్వేషన్లు, హక్కులు కల్పించారు. అయినప్పటికీ అధిక సంఖ్యలో మహిళలకు తమ హక్కుల గురించి తెలియదు. దేశంలోని ప్రతి మహిళకు భారత రాజ్యాంగం.. దేశ చట్టం ద్వారా అందించబడిన 5 ప్రధాన హక్కుల గురించి ఈరోజు తెలుసుకుందాం.. 

1 / 6
సమాన వేతనం పొందే హక్కు: పురుషుల కంటే స్త్రీలు తక్కువ వేతనం పొందడం తరచుగా కనిపిస్తుంది. అది ఆఫీసు పని అయినా, కూలి పని అయినా కష్టానికి తగిన వేతనంలో తేడా కొనసాగుతూనే ఉంది. అయితే మన రాజ్యాంగం స్త్రీలకు సమాన వేతనం లేదా జీతం పొందే హక్కును కల్పించింది. సమాన వేతన చట్టం ప్రకారం..  లింగం ఆధారంగా జీతం లేదా వేతనాలలో వివక్ష ఉండదు. సమాన పనికి స్త్రీ, పురుషులకు సమాన వేతనం ఇవ్వాలని నిబంధన ఉంది.

2 / 6
పేరు , గుర్తింపు గోప్యత: లైంగిక వేధింపులు లేదా అత్యాచారం వార్తల్లో బాధితురాలి పేరును ప్రచురించరాదు. బాధితురాలి పేరు  గోప్యంగా ఉంచబడుతుంది. రాజ్యాంగం కూడా మహిళలకు ఈ హక్కును కల్పించింది. లైంగిక వేధింపుల విషయంలో గోప్యత పాటించేందుకు, మహిళా పోలీసు అధికారి సమక్షంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసే హక్కు మహిళకు ఉంటుంది. కావాలంటే ఆమె నేరుగా జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట కూడా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులు, మీడియా లేదా ఏ అధికారికి కూడా బాధిత మహిళ పేరుని, గుర్తింపుని బహిర్గతం చేసే హక్కు లేదు.

3 / 6
ప్రసూతి ప్రయోజనాలు: ఉద్యోగం చేసే మహిళలు ప్రసూతి ప్రయోజనాలు, సౌకర్యాలకు అర్హులు. మెటర్నిటీ బెనిఫిట్ చట్టం ప్రకారం, మహిళలు డెలివరీ ముందు నుండి బిడ్డ పుట్టిన తర్వాత వరకు 6 నెలల సెలవు తీసుకోవచ్చు. ఈ సమయంలో ఆమె జీతంలో ఒక్క రూపాయి కూడా కోత ఉండదు. తర్వాత ఆమె తిరిగి ఉద్యోగానికి వెళ్లి ఉద్యోగం కొనసాగించవచ్చు.

4 / 6
ఉచిత న్యాయ సహాయం: భారత రాజ్యాంగం లైంగిక వేధింపుల కేసుల్లో ఉచిత న్యాయ సహాయం పొందే హక్కును మహిళలకు కల్పించింది. బాధితురాలు కోరుకుంటే..  ఆమె పోలీస్ స్టేషన్‌లోని SHO నుండి సహాయం పొందవచ్చు. అప్పుడు SHO ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయమని సమీప చట్టపరమైన అధికారానికి తెలియజేస్తాడు. బాధితురాలి కేసుని స్వీకరించించి ఉచితంగా న్యాయ పోరాటం చేస్తారు.

5 / 6
రాత్రిపూట అరెస్టు: చట్టం ప్రకారం.. మహిళలను అరెస్ట్ చేయడానికి కూడా నిబంధనలు ఉన్నాయి. పగలు మాత్రమే మహిళలను అరెస్టు చేస్తారు. చట్టప్రకారం రాత్రిపూట స్త్రీలను అరెస్టు చేయడం సాధ్యం కాదు. నేరం తీవ్రమైనది అయినప్పటికీ..  ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశం లేకుండా, పోలీసులు సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకు మహిళను అరెస్టు చేయలేరు.

6 / 6
Follow us