స్మార్ట్ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ ఎంత ముఖ్యమే బ్యాటరీ కూడా అంతే ముఖ్యం. స్మార్ట్ ఫోన్‌కు బ్యాటరీ ఎక్కువగా రావాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో 5000mAh నుంచి 7000mAh వరకు బ్యాటరీలు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్కువ ఛార్జ్‌తో వస్తాయి. అయితే ఈ బ్యాటరీని సరిగా మెయింటెయిన్ చేయకుంటే కొన్ని నెలల్లోనే పాడయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు విడుదలైన చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జర్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. మరి కొన్ని నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోతుందన్నది నిజం. అయితే, సరిగ్గా మెయింటెన్ చేయకపోతే బ్యాటరీ కూడా వేగంగా చెడిపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలి?.