ఆభరణాల డిమాండ్ ఫ్లాట్‌గా ఉండగా, ఈ త్రైమాసికంలో పెట్టుబడి డిమాండ్ 20 శాతం పెరిగింది. రెండవ త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంక్ డిమాండ్ 35 శాతం క్షీణించి 103 టన్నులకు చేరుకుంది. ప్రధానంగా దేశ నిర్దిష్ట రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా టర్కీలో నికర అమ్మకాలు జరిగాయి. అయితే, 2023 మొదటి ఆరు నెలల్లో సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో 387 టన్నులను కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. జూన్ 2023 నాటికి భారతదేశం 797.4 టన్నుల నిల్వలతో అధికారిక బంగారం నిల్వల పరంగా టాప్ 10 దేశాలలో కొనసాగుతోంది.