తొక్కే కదా అని తేలికగా తీసుకుంటే.. ఈ ప్రయోజనాలు కోల్పోయినట్లే.. అవేంటో తెలుసా..

సాధారణంగా నిమ్మకాయలను వాడిన తర్వాత దాని తొక్కలను పడేస్తూ ఉంటాం. తొక్కే కదా అనే భావనతో మనం దానిని లైట్ తీసుకుంటాం. నిమ్మకాయలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయని, విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుందని మాత్రమే మనకు తెలుసు. ఇక నిమ్మకాయ తొక్కలతోనూ చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ....

Ganesh Mudavath

|

Updated on: Dec 27, 2022 | 1:23 PM

నిమ్మకాయ తొక్కలలో శక్తివంతమైన బయో యాక్టివ్ కాంపౌండ్స్‌తో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సీ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఇంకా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.నిమ్మ తొక్కలను నేరుగా ముఖానికి అప్లై చేస్తే డార్క్ స్పాట్స్, ముడుతలు, ఇతర చర్మ సమస్యలు తొలగిపోతాయి.

1 / 5
ప్రస్తుత కాలంలోని జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తుంది. ఇలాంటి సమయంలోనే పోషకాలతో కూడిన ఆహారాలను, సప్లిమెంట్లను తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వారు సూచిస్తున్న ఆహారాలలో ఒకటైన నిమ్మకాయ ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
నిమ్మకాయలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు అంటున్నారు.

3 / 5
ఎండబెట్టిన నిమ్మ తొక్కల పొడిని గ్రీన్ టీ, హెర్బల్ టీలో కలుపుకొని తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మ తొక్కల పొడిని కొంచెం వంట సోడా, ఉప్పు కలిపి పళ్ళు తోముకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉండడమేకాక తెల్లగా మెరుస్తాయి.

4 / 5
నిమ్మ తొక్కలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల అది మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. గాల్ బ్లాడర్‌లో ఏర్పడే రాళ్ళు పోవడానికి కూడా నిమ్మతొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow us