Tomato Price: టమోటా ధరలను మరింత తగ్గించిన కేంద్రం.. కిలో రూ.40
వివిధ మండీల నుంచి సుమారు 15 లక్షల కిలోల టమోటాలను సేకరించి దేశవ్యాప్తంగా నిరుపేద ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం టమాటా ధర క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కూడా ధరను తగ్గిస్తోంది. అయితే టమాట ధర ఇప్పటికీ కొన్ని చోట్ల రూ.100 పైనే ఉంది. అలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ సహకార సంఘాలు టమాటను రాయితీపై అందజేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు తమ వివిధ ఔట్‌లెట్‌లు మరియు మొబైల్ వాహనాల వద్ద ప్రజలకు టమోటాలను విక్రయిస్తున్నాయి..