Year Ender 2022: బాల్ వేస్తే వికెట్ ఎగరాల్సిందే.. 2022లో దుమ్మురేపిన యంగ్ బౌలర్లు.. లిస్టులో టీమిండియా ప్లేయర్లు..

కేవలం టీ20 గురించి మాట్లాడితే.. ఈ ఏడాది చాలా మంది బౌలర్లు హీరోలుగా ఎదిగారు. ఈ ఏడాది T20Iలో బంతితో హీరోలుగా మారిన వారిని ఇప్పుడు చూద్దాం..

Venkata Chari

|

Updated on: Dec 24, 2022 | 10:53 AM

2022 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బౌలర్లకు అద్భుతమైనదిగా నిలిచింది. చాలా మంది తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో భారతదేశపు యువ సంచలనం అర్ష్దీప్ సింగ్ సత్తా చాటాడు. మనం కేవలం టీ20 గురించి మాట్లాడితే, చాలా మంది బౌలర్లు హీరోలుగా ఎదిగారు. ఈ ఏడాది T20Iలో బంతితో హీరోలుగా మారిన బౌలర్లను చూద్దాం..

1 / 6
వికెట్లు తీయడంలో 2022లో మొదటి స్థానంలో ఉన్న బౌలర్ ఐర్లాండ్‌కు చెందిన జోస్ లిటిల్. ఈ ఏడాది 18.92 సగటుతో అత్యధికంగా 39 వికెట్లు పడగొట్టాడు.

2 / 6
గాయం నుంచి తిరిగి వచ్చిన భారత ఆటగాడు భువనేశ్వర్ కుమార్ 30 ఇన్నింగ్స్‌ల్లో 19.02 సగటుతో 36 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచాడు. 4 పరుగులకే 5 వికెట్లు తీయడం అతని అత్యుత్తమంగా నిలిచింది.

3 / 6
2022లో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ మూడో స్థానంలో ఉన్నాడు. 19 ఇన్నింగ్స్‌ల్లో 34 వికెట్లు తీశాడు. ఈ సమయంలో, అతని సగటు 15.52గా నిలిచింది.

4 / 6
భారత యువ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. 20 ఇన్నింగ్స్‌ల్లో 31 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్ 2022 సంవత్సరంలోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

5 / 6
2022లో టీ20ల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో పాకిస్థాన్‌కు చెందిన హరీస్ రౌఫ్ 5వ స్థానంలో నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌ల్లో 20.74 సగటుతో 31 వికెట్లు తీశాడు.

6 / 6
Follow us