కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా గురువారం జరిగిన KKR వర్సెస్ RCB మ్యాచ్‌కు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ హాజరయ్యారు. KKR జట్టు సహ యజమానిగా వ్యవహరిస్తోన్న కింగ్ ఖాన్ తన కూతురు సుహానే ఖాన్‌తో కలిసి స్టేడియానికి వచ్చాడు.
Ipl 2023 3
Follow us
ల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా గురువారం జరిగిన KKR వర్సెస్ RCB మ్యాచ్‌కు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ హాజరయ్యారు. KKR జట్టు సహ యజమానిగా వ్యవహరిస్తోన్న కింగ్ ఖాన్ తన కూతురు సుహానే ఖాన్‌తో కలిసి స్టేడియానికి వచ్చాడు.
సుహానేఖాన్తో పాటు ఆమె స్నేహితురాలు షానాయ కపూర్ కూడా స్టేడియంలో తళుక్కుమంది. ఎప్పటిలాగే సుహానే ఎంతో అందంగా కనిపిస్తే.. ఆమె పక్కన బ్లూ కలర్ జీన్స్, కేకేఆర్ జెర్సీతో సింపుల్‌గా వచ్చిన శనాయ కపూర్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కూతురే ఈ శనాయ కపూర్. ముంబైలో పుట్టిన శనాయ, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాల్లో నటించింది.
KKR జట్టు సహ యజమాని నటి జుహీ చావ్లా, అలాగే ప్రముఖ గాయని ఉషా ఉత్తప్ కూడా కోల్‌కతా మ్యాచ్ చూడడానికి ఈడెన్ గార్డెన్‌కు వచ్చారు. తమ జట్టును దగ్గరుండి ప్రోత్సహించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు శార్దూల్ ఠాకూర్ (68) రాణించడంతో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 17.4 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయి 81 పరుగుల తేడాతో ఓడిపోయింది.