IND vs AUS 4th Test: సరికొత్త చరిత్రకు 5 అడుగుల దూరం.. బద్దలవ్వనున్న కుంబ్లే భారీ రికార్డ్‌.. అదేంటంటే?

India Vs Australia: మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రెండు భారీ రికార్డులను ఆర్ అశ్విన్ బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు.

Venkata Chari

|

Updated on: Mar 07, 2023 | 11:01 AM

అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో, చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. అహ్మదాబాద్‌లో సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించాలని టీమిండియా కన్నేసింది. అయితే, ప్రస్తుతం అహ్మదాబాద్‌లో అందరి చూపు ఆర్‌ అశ్విన్‌పైనే నెలకింది. అందుకు క్ష ప్రత్యేక కారణం ఉంది.

1 / 5
భారత స్టార్ బౌలర్ అశ్విన్ నాలుగో టెస్టులో భారత గ్రేట్ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టగలడు. కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాలంటే అశ్విన్ నాలుగో టెస్టులో కనీసం 5 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.

2 / 5
అశ్విన్ ఈ ఘనత సాధిస్తే టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రికార్డు కుంబ్లే పేరిట ఉంది.

3 / 5
ఆస్ట్రేలియాపై టెస్టు క్రికెట్‌లో అనిల్ కుంబ్లే 111 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 107 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ మినహా మరే భారత బౌలర్ ఈ జట్టుపై 100 వికెట్లకు మించి తీయలేదు.

4 / 5
ఇది కాకుండా, స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో కుంబ్లే, అశ్విన్ ఇద్దరూ తలో 25 వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నారు. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాపై మరో 5 వికెట్లు తీసి అశ్విన్ కుంబ్లేను అధిగమిస్తాడు.

5 / 5
Follow us