దేశంలోనే తొలిసారిగా ఈ వేరియంట్‌కు చెందిన ఓ రోగిని గుర్తించారు. బీజే మెడికల్ కాలేజీ సీనియర్ రీసెర్చర్, మహారాష్ట్ర జీనోమ్ సీక్వెన్సింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ కర్క్టే ప్రకారం.. ఓమిక్రాన్ EG.5.1 వేరియంట్ మేలో గుర్తించినట్లు ఆయన చెప్పారు. అయితే దీని తరువాత జూన్, జూలై నెలలో ఈ వేరియంట్ రోగుల సంఖ్య ఎక్కువగా లేదని, గత రెండు నెలల్లో రాష్ట్రంలో కేవలం XBB.1.16, XBB.2.3 వేరియంట్‌లు మాత్రమే గుర్తించామని పేర్కొన్నారు.