Shaik Madar Saheb |
Updated on: Jan 04, 2023 | 11:52 AM
చైనా మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైళ్లను ప్రారంభించింది. చైనా అర్బన్ ప్రాంతాల్లో పరుగులు తీస్తున్న ఈ హైడ్రోజన్ రైలు సెమీ హై స్పీడ్ కేటగిరికి చెందినది.
చైనాకు చెందిన CRRC కార్పొరేషన్ లిమిటెడ్ ఈ హైడ్రోజన్ అర్బన్ రైలును ఆవిష్కరించింది. ఇది ఆసియాలో మొదటి ట్రైన్ కాగా.. గతంలో జర్మనీ ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ఆవిష్కరించింది.
ఈ రైలు ఫక్సింగ్ హై-స్పీడ్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇది గంటలకు 160 కిమీ వేగంతో దూసుకెళ్తుంది. దీనిలో నాలుగు బోగిలు ఉంటాయి.
ఈ సెమీ హై స్పీడ్ హైడ్రోజన్ ట్రైన్ లో ఒక్కసారి హైడ్రోజన్ ఇంధనం నింపితే.. 600 కిమీ ఆగకుండా ప్రయాణించగలదు. CRRC షంటింగ్ లోకోమోటివ్‌ను 2021లో ప్రవేశపెట్టగా.. హైడ్రోజన్ ట్రామ్‌లు 2010ల మధ్యలో ఉత్పత్తి చేసింది.
CRRC కోసం డిజిటల్ సొల్యూషన్‌లు GoA2 ఆటోమేషన్, కాంపోనెంట్ మానిటరింగ్ సెన్సార్‌లు, 5G డేటా ట్రాన్స్‌మిషన్ పరికరాలను దీనిలో అమర్చారు. డీజిల్ ట్రాక్షన్‌తో పోలిస్తే రైలు ఆపరేషన్ సంవత్సరానికి 10 టన్నుల CO2 ఉద్గారాలను తగ్గిస్తుందని చైనా పేర్కొంది.
అయితే.. భారతదేశంలో కూడా త్వరలో హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుంది.