SUV Cars: కార్ ప్రియులకు శుభవార్త.. త్వరలో ఆప్‌డేట్ పొందడానికి సిద్ధంగా ఉన్న టాప్ 5 ఎస్‌యూవీలివే..!

దేశంలో ఎస్‌యూవీల విక్రయాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. SUV కార్లు వాటి పెద్ద పరిమాణం, గొప్ప ఫీచర్లతో ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కార్ల కంపెనీలు అమ్మకాలను పెంచుకునేందుకు ఇప్పటికే ఉన్న మోడళ్లకు అనేక అప్‌డేట్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 SUVలలో ఎలాంటి అప్‌డేట్‌లను పొందవచ్చో ఇక్కడ చూడండి.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 08, 2023 | 6:30 AM

Tata Nexon: 2022లో అత్యధికంగా అమ్ముడైన Tata Nexon ఫేస్‌లిఫ్ట్ మోడల్ త్వరలో ఆప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది. రానున్న కొత్త మోడల్‌లో ADAS సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటులో ఉంటుందని సమాచారం. అంతేకాకుండా కొత్త స్టీరింగ్ వీల్, కొత్త అప్హోల్స్టరీ, కొత్త TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను కూడా ఉండే అవకాశం ఉంది.

1 / 5
Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను 1.5L టర్బో పెట్రోల్ ఇంజన్ శక్తితో పరిచయం చేయవచ్చు. ఇదే కాకుండా డ్యూయల్ డిస్‌ప్లే, వెంటిలేషన్‌తో కూడిన కొత్త ఫ్రంట్ సీట్లు, హీటింగ్ ఫంక్షన్ వంటి ఫీచర్లను కొత్త క్రెటాలో చూడవచ్చు. మరోవైపు స్టైలింగ్ కొంచెం వెర్నా లాగా కూడా ఇది ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

2 / 5
Mahindra Bolero: మహీంద్రా కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న SUV అయిన మహింద్రా బోలెరో కొత్త తరం మోడల్ త్వరలో కనిపించవచ్చు. దీనిని స్కార్పియో ఎన్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తున్నారని సమాచారం. కంపెనీ తన బోలెరోలో ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద మార్పు చేసి.. సిగ్నేచర్ లోగోతో కొత్త బొలెరోలో క్రోమ్ యాక్సెంట్ 7 స్లాట్ గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్, రెక్టాంగిల్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఇవ్వవచ్చు. కొత్త బొలెరో ప్రస్తుత మోడల్ కంటే పెద్దదిగా ఉండనుందని సమాచారం.

3 / 5
Kia Seltos: కియా సెల్టోస్ కూడా తన అప్‌డేట్ వెర్షన్‌లో కొత్త 1.5లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఇవ్వనుంది. సెల్టోస్ కొత్త మోడల్ కొత్త ఫీచర్లతో పాటు ADAS సెక్యూరిటీ సిస్టమ్‌తో కూడి ఉంటుందని భావిస్తున్నారు. కొత్త సెల్టోస్ రీడిజైనెగ్ గ్రిల్, ఫాక్స్ అల్యూమినియం స్కిడ్ ప్లేట్‌తో కూడిన ఎయిర్ డ్యామ్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు,  కొత్త అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.

4 / 5
Toyota Fortuner:  దేశంలో అత్యధికంగా ఇష్టపడే SUVలలో టయోటా ఫార్చ్యూనర్ ఒకటి. దీని కొత్త మోడల్‌ను టయోటా టాకోమా తరహాలో అభివృద్ధి చేయవచ్చు. అదే సమయంలో ఇందులోకి ల్యాండ్ క్రూయిజర్ 300 నుంచి కూడా కొంత డిజైన్ తీసుకోవచ్చు. కొత్త టయోటా ఫార్చ్యూనర్‌లో ADAS, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, 1GD-FTV 2.8L డీజిల్ ఇంజన్, మైల్డ్ హైబ్రిడ్ టెక్, ISG వంటి ఫీచర్లతో ప్యాక్ అయ్యే అవకాశం ఉంది.

5 / 5
Follow us