ప్రస్తుతం వీటిపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కసరత్తులు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ రైలును వయా నల్గొండ, బీబీనగర్, గుంటూరు మీదుగా నడపనున్నారని తెలుస్తోంది. మొదటి వందేభారత్ ట్రైన్(సికింద్రాబాద్ టూ వైజాగ్) విజయవాడ మీదుగా వరంగల్, ఖమ్మంలను కలుపుతూ వెళ్తుండటంతో.. రెండో రైలును మిర్యాలగూడ, నల్గొండ, గుంటూరు ప్రయాణికులకు కనెక్టివిటీని అందించాలని రైల్వేశాఖ భావిస్తోంది.