Watch: రైలు పట్టాలపై పరుగులు పెట్టిన మహీంద్రా బొలెరో.. ఆశ్చర్యపోయిన ఆనంద్‌ మహీంద్రా..

ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, అందులో బొలెరో సామర్థ్యం కొత్త ఎత్తులకు చేరుతోందని అన్నారు. ‘‘స్వతంత్ర భారతదేశంలో మహీంద్రా వ్యవస్థాపకులు రహదారి లేని చోటికి వెళ్లేలా వాటిని తయారు చేశారు’’ అని అన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెబుతూ..

Watch: రైలు పట్టాలపై పరుగులు పెట్టిన మహీంద్రా బొలెరో.. ఆశ్చర్యపోయిన ఆనంద్‌ మహీంద్రా..
Mahindra Bolero
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 28, 2023 | 7:20 PM

దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు మహీంద్రా & మహీంద్రా దాని శక్తివంతమైన స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (SUV) తయారీకి ప్రసిద్ధి చెందింది. సంస్థకు చెందిన అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటైన మహీంద్రా బొలెరో దశాబ్దాలుగా రోడ్లపై అద్భుతంగా పరుగులు తీస్తోంది. అయితే, ఇటీవల ఈ SUV ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై పరుగులు పెడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆశ్చర్యకరంగా ఈ మహీంద్రా బొలెరో వెహికిల్‌ రైల్వే ట్రాక్‌పై నడుస్తోంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకీ ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా..? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇందులో మహీంద్రా బొలెరో ఎస్‌యూవీని కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మిస్తున్న నిర్మాణంలో ఉన్న వంతెనపై సర్వే వాహనంగా నడుపుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన. ఇది ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ వీడియోలో చూపిన బొలెరో SUV రైల్వే ట్రాక్‌పై సర్వే కారుగా కస్టమైజ్ చేయబడింది. SUVని ట్రాక్‌లోకి తీసుకురావడానికి ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ కూడా తయారు చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే ఎత్తైన ఈ రైల్వే బ్రిడ్జికి ‘చీనాబ్ బ్రిడ్జి’ అని పేరు పెట్టారు. ఇది చీనాబ్ నది నీటి మట్టం కంటే 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ వంతెన మొత్తం పొడవు 1315 మీటర్లు. ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నందున SUV ట్రాక్‌లపై నడుస్తోంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో రాజేంద్ర బి. అక్లేకర్ పోస్ట్ చేశారు.

ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, అందులో బొలెరో సామర్థ్యం కొత్త ఎత్తులకు చేరుతోందని అన్నారు. ‘‘స్వతంత్ర భారతదేశంలో మహీంద్రా వ్యవస్థాపకులు రహదారి లేని చోటికి వెళ్లేలా వాటిని తయారు చేశారు’’ అని అన్నారు. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెబుతూ వీటిని ఎప్పటికీ తన వద్దనే భద్రంగా దాచుకుంటానని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..